- Telugu News Photo Gallery Cricket photos David Warner becomes 1st Australian to score 500 runs in two ODI World Cup editions 3rd after sachin rohit
David Warner: వార్నర్ ఖాతాలో అరుదైన రికార్డ్.. తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా.. సచిన్, రోహిత్ జాబితాలో ఎంట్రీ..
ICC World Cup 2023: ఈ ఎడమచేతి వాటం ఆటగాడు 2019 ప్రపంచ కప్ ఎడిషన్‌లో 647 పరుగులు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో 528 పరుగులు చేశాడు. మొత్తంగా రెండు ప్రపంచ కప్‌లలో 500 కంటే ఎక్కువ స్కోర్ చేసిన మూడవ బ్యాటర్‌గా వార్నర్ నిలిచాడు. ఈ క్రమంలో రెండు వేర్వేరు వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లలో 500 పరుగులు చేసిన మొదటి ఆస్ట్రేలియా బ్యాటర్‌గా నిలిచాడు.
Updated on: Nov 16, 2023 | 9:35 PM

గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌లో డేవిడ్ వార్నర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 18 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సులతో 29 పరుగులు చేసి, పెవిలియన్ చేరాడు.

ఈ క్రమంలో రెండు వేర్వేరు వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లలో 500 పరుగులు చేసిన మొదటి ఆస్ట్రేలియా బ్యాటర్‌గా నిలిచాడు.

ఈ ఎడమచేతి వాటం ఆటగాడు 2019 ప్రపంచ కప్ ఎడిషన్‌లో 647 పరుగులు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో 528 పరుగులు చేశాడు. మొత్తంగా రెండు ప్రపంచ కప్‌లలో 500 కంటే ఎక్కువ స్కోర్ చేసిన మూడవ బ్యాటర్‌గా వార్నర్ నిలిచాడు.

ఇక టీమిండియా తరపున సచిన్ టెండూల్కర్ (1996, 2003), రోహిత్ శర్మ తర్వాత ( 2019, 2023) రెండు ఎడిషన్లలో 500+ స్కోర్లు నమోదు చేశారు.

ప్రపంచ కప్‌లో 500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఇతర ఆస్ట్రేలియన్లలో రికీ పాంటింగ్ (2007), మాథ్యూ హేడెన్ (2007) ఆరోన్ ఫించ్ (2019) నిలిచారు.




