uppula Raju |
Updated on: Mar 09, 2022 | 2:03 PM
క్రికెట్ నిబంధనలని తెలియజేసే MCC ఆటలో కొన్ని కొత్త చట్టాలను తీసుకురావాలని నిర్ణయించింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లతో పాటు ఫీల్డర్లకు సంబంధించి కొత్త నిబంధనలని రూపొందించింది.
MCC కొత్త నిబంధనల ప్రకారం ఆటగాడు ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చే ఆటగాడు స్ట్రైకింగ్ తీసుకోవచ్చు.
ఐసీసీ మన్‌కడింగ్ విషయంలో కూడా మార్పు చేసింది. ఇంతకు ముందు దీనిని క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకంగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు అది చట్టం38 అంటే రనౌట్ కింద భావిస్తున్నారు.
ఇంతకుముందు కోవిడ్ 19 కారణంగా బంతిపై ఉమ్మివేయడాన్ని నిషేధించారు.
కానీ ఇప్పుడు MCC బంతిపై ఉమ్మి వేయడాన్ని పూర్తిగా నిషేధించింది. అంతేకాదు దీనిని చట్టంగా చేస్తోంది.