- Telugu News Photo Gallery Cricket photos IPL 2024 Auction All Teams Slots and Action Plan check here full details
IPL 2024 Auction: ఏ జట్టు ఎంత మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగలదో తెలుసా? పూర్తి సమాచారం ఇదిగో..
Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 వేలం ప్రక్రియ రేపు (డిసెంబర్ 19) జరుగుతుంది. దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరిగే ఈ యాక్షన్‌లో మొత్తం 333 మంది ఆటగాళ్లను వేలం వేయనున్నారు. అయితే వీరిలో 77 మంది ఆటగాళ్లకు మాత్రమే అవకాశం దక్కనుంది. వీరిలో కొందరికి మాత్రమే అవకాశం దక్కుతుంది. మొత్తం పది ఐపీఎల్ జట్లు ఈ వేలానికి పూర్తి సన్నద్ధమయ్యాయి.
Updated on: Dec 18, 2023 | 2:40 PM

ఐపీఎల్ మినీ వేలానికి కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు (డిసెంబర్ 19న) దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. అయితే వీరిలో 77 మంది ఆటగాళ్లకు మాత్రమే అవకాశం దక్కనుంది.

అంటే 10 జట్లలో 77 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. తద్వారా 333 మంది ఆటగాళ్లలో కేవలం 77 మంది ఆటగాళ్లకు మాత్రమే అవకాశం దక్కనుంది. కాబట్టి, ఒక జట్టు ఎంత మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చో పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం..

1- చెన్నై సూపర్ కింగ్స్ (CSK): ఈ వేలంలో CSK మొత్తం ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేయగలదు. వీరిలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు, ముగ్గురు భారత ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు.

2- గుజరాత్ టైటాన్స్ (GT): గుజరాత్ టైటాన్స్ మొత్తం 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో 6 మంది భారతీయ, 2 విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

3- కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఖాళీగా ఉన్న స్లాట్ల సంఖ్య 12. ఈ స్థానాల్లో 8 మంది భారs, 4 విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

4- సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): SRH జట్టులో 6 ఖాళీలు ఉన్నాయి. ఈ స్లాట్లలో ముగ్గురు భారతీయులు, ముగ్గురు విదేశీ ఆటగాళ్లు కొనుగోలు చేయవచ్చు.

5- ముంబై ఇండియన్స్ (MI): ఇండియన్స్ జట్టు మొత్తం 8 స్లాట్‌లను కలిగి ఉంది. ఇందులో నలుగురు విదేశీ, నలుగురు భారతీయ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

6- లక్నో సూపర్ జెయింట్స్ (LSG): లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. ఈ స్థానాల్లో నలుగురు భారత ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

7- రాజస్థాన్ రాయల్స్ (RR): రాజస్థాన్ జట్టులో ఖాళీగా ఉన్న స్లాట్ల సంఖ్య 8. ఇందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు, ఐదుగురు భారత ఆటగాళ్లను అనుమతించవచ్చు.

8- ఢిల్లీ క్యాపిటల్స్ (DC): ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి 9 స్లాట్‌లు ఉన్నాయి. వీటిలో 4గురు విదేశీ మరియు 5గురు భారతీయ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

9- పంజాబ్ కింగ్స్ (PBKS): పంజాబ్ జట్టులో మొత్తం 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ స్లాట్లలో ఇద్దరు విదేశీ, 6గురు భారతీయ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.

10- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): RCB జట్టు ఈసారి మొత్తం 6 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఆరు స్లాట్‌లలో 3గురు విదేశీ, ముగ్గురు భారత ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.




