- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Most Centuries Against Single Team, Chris Gayle, KL Rahul, David Warner And Virat Kohli In List
ఐపీఎల్ తోపు బ్యాటర్లు వీరే.. ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు.. లిస్టులో టీమిండియా ప్లేయర్లు.!
ఐపీఎల్ అంటేనే పరుగుల వరదకు కేరాఫ్ అడ్రస్. కొన్ని మ్యాచ్‌లు మినహా.. మిగిలిన అన్నింటిలోనూ బ్యాట్స్‌మెన్లదే హవా. ఇక ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికే ఎందరో బ్యాట్స్‌మెన్లు సెంచరీలు చేశారు. మరి ఒకే జట్టులో అత్యధిక శతకాలు బాదేసిన బ్యాటర్లు ఎవరో తెలుసుకుందామా..
Updated on: Apr 19, 2023 | 6:39 PM

ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో 77 సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో అత్యధికం యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(6) బ్యాట్ నుంచి వచ్చాయి. అటు ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.

ఐపీఎల్ 2016లో సీజన్‌లో విరాట్ కోహ్లీ విధ్వంసం మాములుగా లేదు. ఆ సమయంలో విరాట్ 16 మ్యాచ్‌లలో 152.03 స్ట్రైక్ రేట్‌తో 973 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. వాటిల్లో రెండు.. గుజరాత్ లయన్స్‌పై నమోదయ్యాయి.

ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ప్లేయర్లలో ఒకడు డేవిడ్ వార్నర్. అతడు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రెండు సెంచరీలను కొట్టాడు. మొదటిది 2010లో, రెండవది 2017లో సాధించాడు.

ఇక క్రిస్ గేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యూనివర్సల్ బాస్ బరిలోకి దిగితే విధ్వంసమే. ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ సెంచరీలు సాధించాడు క్రిస్ గేల్. ఏకంగా 6 శతకాలు కొట్టాడు. అలాగే పంజాబ్ కింగ్స్ జట్టుపై 2011, 2015 సీజన్లలో సెంచరీలు బాదేశాడు.

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 4 సెంచరీలు బాదగా.. అందులో మూడు శతకాలు ముంబైపై నమోదు చేశాడు. మరొకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై కొట్టాడు.




