- Telugu News Photo Gallery Cricket photos Ipl 2022 ms dhoni Quits Chennai Super Kings Captaincy; MS Dhoni captaincy records csk new captain ravindra jadeja
MS Dhoni Quits CSK Captaincy: 11 ఫ్లేఆఫ్స్.. 9 ఫైనల్స్.. 4 సార్లు ఛాంపియన్.. ధోనీ రికార్డులు చూస్తే వావ్ అనాల్సిందే..
Chennai Super Kings: ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 9 సార్లు ఫైనల్‌కు చేరుకోగా, ఆ జట్టు 11 సార్లు ప్లేఆఫ్‌కు చేరుకుంది.
Updated on: Mar 24, 2022 | 5:02 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ప్రారంభానికి 2 రోజుల ముందు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ నిర్ణయంతో అభిమానులందరికీ షాకిచ్చాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఒక ప్రకటన ద్వారా అభిమానులకు తెలియజేసింది. ధోనీ వారసుడిగా రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఎంఎస్ ధోనీ చెన్నై సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ధోనీ ఈ జట్టును 6 సార్లు ఛాంపియన్‌గా చేశాడు. కెప్టెన్‌గా ధోనీ ఏం సాధించాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో 204 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా అందులో 121 మ్యాచ్‌లు గెలిచాడు. అదే సమయంలో అతను 82 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ధోని విజయాల శాతం 59.60గా ఉంది.

ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 9 సార్లు ఫైనల్‌కు చేరుకోగా, ఆ జట్టు 11 సార్లు ప్లేఆఫ్‌కు చేరుకుంది.

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. చెన్నై తరఫున ధోనీ 2 సార్లు ఛాంపియన్స్ లీగ్‌ని గెలుచుకోగలిగాడు.

చెన్నై కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత, 2007 సంవత్సరం తర్వాత ధోని తొలిసారిగా కెప్టెన్సీ లేకుండా బరిలోకి దిగనున్నాడు. ధోనీ కెప్టెన్సీ కెరీర్‌లో టీమిండియా ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది.




