- Telugu News Photo Gallery Cricket photos IPL 2022 five players who could take by storm ipl 2022 season wanindu hasranga dewald brewis
IPL 2022: బరిలోకి దిగితే దబిడదిబిడే.. అటు బాల్, ఇటు బ్యాట్‌తో సత్తా చాటేందుకు సిద్ధమైన యువ ప్లేయర్లు వీరే..
IPL 2022 ప్రారంభానికి కొద్ది రోజులే మిగిలి ఉంది. ఈసారి లీగ్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి. మెగా వేలంలో చాలామంది ఆటగాళ్లపై 10 జట్లు కోట్ల వర్షం కురిపించాయి.
Updated on: Mar 18, 2022 | 9:41 AM

IPL 2022 ప్రారంభానికి కొద్ది రోజులే మిగిలి ఉంది. ఈసారి లీగ్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి. మెగా వేలంలో చాలామంది ఆటగాళ్లపై 10 జట్లు కోట్ల వర్షం కురిపించాయి. వనిందు హసరంగా వంటి అనుభవజ్ఞుల నుంచి యువ ప్లేయర్ డెవాల్డ్ బ్రీవిస్ వరకు ఈ ఏడాది ఐపీఎల్‌లో నిరూపించుకునే ఛాన్స్ ఉంది.

ఈసారి వేలంలో అత్యధికంగా అమ్ముడైన ఆటగాళ్లలో శ్రీలంక స్టార్ బౌలర్ వనిందు హసరంగా ఉన్నాడు. ఈ ఆటగాడి కోసం ఆర్సీబీ రూ.10.75 కోట్లు వెచ్చించింది. అతను గత 18 నెలల్లో అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. 2021లో టీ20లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. గతేడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గాను నిలిచాడు.

27 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ రొమారియో షెపర్డ్‌ను ఫినిషర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి చేరాడు. రూ.7 కోట్ల 70 లక్షలకు హైదరాబాద్ కొనుగోలు చేసింది. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ మంచి ఆటతీరు కనబరిచాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ షెపర్డ్ ప్రమాదకరమైన హీటింగ్‌కు కూడా పేరుగాంచాడు.

IPL-2022 మెగా వేలంలో, వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఒడియన్ స్మిత్‌ను కోటి ప్రాథమిక ధరతో పంజాబ్ కింగ్స్ ఆరు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. స్మిత్ తొలిసారి ఐపీఎల్‌లో పాల్గొంటున్నాడు. 2018లో వెస్టిండీస్ తరఫున టీ20 అరంగేట్రం చేశాడు. భారీ లాంగ్ షాట్లను కొట్టడంలో ప్రసిద్ధి చెందాడు. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతని బ్యాట్ భీకరంగా పరుగెత్తింది. ఈ సిరీస్‌లో భారీ సిక్సర్ల వర్షం కురిపించి ఆకట్టుకున్నాడు.

22 ఏళ్ల యువ ఓపెనర్ ఫిల్ అలెన్ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. 11 ఇన్నింగ్స్‌లలో 200 స్ట్రైక్ రేట్‌తో 280 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ అలెన్ 190.24 స్ట్రైక్ రేట్‌తో 156 పరుగులు చేశాడు. ఇందులో హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఆర్సీబీ అతడిని కేవలం రూ.80 లక్షలకు కొనుగోలు చేసింది.

అండర్ 19 ప్రపంచకప్‌లో స్టార్‌గా నిలిచిన బేబీ డివిలియర్స్‌గా పేరుగాంచిన దక్షిణాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌పై కూడా చాలా ఆశలు ఉన్నాయి. వెస్టిండీస్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో బ్రెవిస్‌ను ముంబై ఇండియన్స్ మూడు కోట్ల రూపాయలు వెచ్చించింది. రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలతో అండర్-19లో సత్తా చాటాడు. అలాగే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా కూడా ఎంపికయ్యాడు. అతని స్ట్రోక్‌ప్లేపై ప్రశంసల వర్షం కురిసింది. అండర్-19 ప్రపంచకప్ 2022లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 6 మ్యాచ్‌ల్లో 506 పరుగులు చేశాడు.





























