- Telugu News Photo Gallery Cricket photos Holi 2022: Cricketers old and recent Holi photos on social media
Holi 2022: రంగుల్లో తడిసి ముద్దైన క్రికెటర్లు.. బయోబబుల్ దెబ్బకు పాత ఫొటోలతో నెట్టింట్లో హల్‌చల్..
ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా చేసుకుంటున్నారు. ప్రపంచం మొత్తం రంగులతో నిండి పోయింది. ఇందులో పురుషుల, మహిళల జట్లకు చెందిన క్రికెట్ క్రీడాకారులు కూడా హోలీ వినోదంలో మునిగిపోయారు. అయితే, ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.
Updated on: Mar 18, 2022 | 9:36 AM

ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా చేసుకుంటున్నారు. ప్రపంచం మొత్తం రంగులతో నిండి పోయింది. ఇందులో పురుషుల, మహిళల జట్లకు చెందిన క్రికెట్ క్రీడాకారులు కూడా హోలీ వినోదంలో మునిగిపోయారు. ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కారణం- న్యూజిలాండ్‌లో జరుగుతున్న ప్రపంచ కప్ కారణంగా మహిళల జట్టు పండుగను స్వేచ్ఛగా ఆస్వాదించలేకపోయింది. ఐపీఎల్ కారణంగా భారత పురుషుల ఆటగాళ్లు బయో బబుల్‌లో ఉన్నారు. ఈ కారణంగా పాత ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుని, సంబురపడిపోయారు.

భారత మహిళా క్రీడాకారులు కూడా హోలీ ఆడే అవకాశాన్ని వదులుకోవడం లేదు. విదేశీ పర్యటనలో ఉన్నారు.

వినీ రామన్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లాక్స్ మాక్స్‌వెల్‌కు కాబోయే భార్య కూడా హోలీ ఆడే అవకాశాన్ని వదిలిపెట్టలేదు.

విరాట్ కూడా హోలీ ఆడే అవకాశాన్ని వదిలిపెట్టడు. ఈ చిత్రంలో, హర్భజన్, రోహిత్ కూడా హోలీ సందర్భంగా కనిపించారు.

టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా ఫోటోలను పంచుకుంటాడు. అయితే, ఈసారి ఐపీఎల్ కారణంగా అతను బయోబుడల్‌లో ఉన్నాడు.

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ రెండేళ్ల క్రితం హోలీ ఆడుతున్నప్పుడు ఈ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

ఈ చిత్రంలో యువరాజ్, హర్భజన్, రోహిత్, ధోనీ లాంటి ఆటగాళ్లు హోలీ ఆడుతున్న సందర్భంలో తీసిన ఫొటో. ఈ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడు హోలీ సందర్భంగా సరదాగా గడిపేవారు.

ఈ జాబితాలో మరో ఆస్ట్రేలియా దిగ్గజం బ్రెట్ లీ పేరు కూడా చేరింది. అతను హోలీ ఆడటం చాలా సార్లు మనం చూశాం.





























