- Telugu News Photo Gallery Cricket photos IND vs SL Team India Star Players Rohit sharma and virat kohli eyes on ms dhoni and Sachin Tendulkar unique records
IND vs SL: సచిన్-ధోనీల రికార్డులపై కన్నేసిన కోహ్లీ-రోహిత్.. లిస్టులో ఏమున్నాయంటే?
IND vs SL: రెండో వన్డేలో రోహిత్ శర్మ మాత్రమే కాకుండా విరాట్ కోహ్లీ కూడా ప్రత్యేక రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు మాజీ లెజెండరీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నారు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఏ జట్టుపైనా 100 మ్యాచ్‌లు గెలిచిన ఫీట్‌ను కూడా టీమిండియా సాధిస్తుంది.
Updated on: Aug 04, 2024 | 7:58 AM

ప్రస్తుతం భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. కొలంబోలో జరిగిన తొలి మ్యాచ్ ఉత్కంఠగా సాగి, చివరకు టైగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ కూడా కొలంబోలో జరగనుండగా, ఈ మ్యాచ్‌లోనూ రోహిత్ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

రెండో వన్డేలో రోహిత్ శర్మ మాత్రమే కాదు విరాట్ కోహ్లీ కూడా ప్రత్యేక రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు మాజీ లెజెండరీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నారు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఏ జట్టుపైనా 100 మ్యాచ్‌లు గెలిచిన ఫీట్‌ను కూడా టీమ్ ఇండియా సాధిస్తుంది.

తొలి వన్డేలోనూ కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును రోహిత్ బద్దలు కొట్టే అవకాశం ఉంది.

నిజానికి, ధోనీ తన వన్డే కెరీర్‌లో మొత్తం 10773 పరుగులు చేశాడు, ఇప్పుడు రెండో వన్డేలో 7 పరుగులు చేస్తే రోహిత్ శర్మ ధోనిని అధిగమిస్తాడు. వన్డేల్లో రోహిత్ ఇప్పటివరకు 10767 పరుగులు చేశాడు.

రోహిత్‌కి ధోని మాత్రమే కాకుండా క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. క్రిస్ గేల్ తన 301 వన్డేల కెరీర్‌లో మొత్తం 331 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 263 మ్యాచ్‌లు ఆడి 326 సిక్సర్లు కొట్టాడు. రెండో మ్యాచ్‌లో రోహిత్ 6 సిక్సర్లు బాదితే గేల్ రికార్డును బద్దలు కొడతాడు.

రోహిత్ లాగే కోహ్లీ కూడా ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఆడిన 293 వన్డేల్లో 58 సగటుతో 13872 పరుగులు చేశాడు. తదుపరి మ్యాచ్‌లో 128 పరుగులు సాధిస్తే 14 వేల పరుగుల మార్కును చేరుకుంటాడు. దీంతో ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గానూ, ప్రపంచంలోనే మూడో బ్యాట్స్‌మెన్‌గానూ నిలుస్తాడు. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర మాత్రమే ఈ ఘనత సాధించారు.

అంతేకాదు, అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగుల మార్కును చేరుకోవడానికి విరాట్ కేవలం 92 పరుగుల దూరంలో ఉన్నాడు. రెండో మ్యాచ్‌లో కోహ్లీ 92 పరుగులు చేస్తే.. ఈ ఘనత సాధించిన ప్రపంచంలో నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్ మాత్రమే ఈ మైలురాయిని అధిగమించారు.




