IND vs SA: ఆఫ్రికా గడ్డపై కేఎల్ రాహుల్ స్పెషల్ రికార్డ్.. ధోనిని వెనక్కునెట్టి తొలి కెప్టెన్‌గా సరికొత్త చరిత్ర..
IND vs SA, KL Rahul: గత 10 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా జట్టును విజయతీరాలకు చేర్చిన కేఎల్ రాహుల్‌కి ఇది వరుసగా 10వ విజయం. దీంతో రాహుల్ ప్రత్యేక కెప్టెన్సీ రికార్డులో ధోనీని అధిగమించాడు. వరుసగా అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా ధోనీని రాహుల్ అధిగమించాడు. రాహుల్ వరుసగా 10వ విజయాన్ని నమోదు చేయగా, ధోనీ 2013లో 9 మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు.