- Telugu News Photo Gallery Cricket photos IND vs BAN 1st Test Team India Players Ravichandran Ashwin and Ravindra Jadeja break 24 year old record
IND vs BAN: 20 ఏళ్ల చరిత్రకు చెక్ పెట్టేసిన జడేజా-అశ్విన్ జోడీ.. దెబ్బకు సచిన్-జహీర్ ప్లేస్ ఖాళీ
R Ashwin-Ravindra Jadeja: రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్‌లు టీమ్ ఇండియాకు ఎన్నో మ్యాచ్‌లు గెలిపించారు. వీరిద్దరూ ఈరోజు అదే పని చేసి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా 7వ వికెట్‌కు రికార్డు భాగస్వామ్యంతో దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టారు.
Updated on: Sep 19, 2024 | 8:48 PM

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్‌లు టీమిండియాకు ఎన్నో మ్యాచ్‌లు గెలిచారు. వీరిద్దరూ ఈరోజు అదే పని చేసి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా 7వ వికెట్‌కు రికార్డు భాగస్వామ్యంతో దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టారు.

బంగ్లాదేశ్-భారత్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్ 144 పరుగులకే 6 ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో 7వ వికెట్‌కు అశ్విన్, జడేజాలు అభేద్యమైన 195 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఈ 195 పరుగుల భాగస్వామ్యంలో అశ్విన్ అజేయంగా 102 పరుగులు చేయగా, జడేజా 86 పరుగులతో అజేయంగా ఉన్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు 2004లో 7వ వికెట్‌కు ఈ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా సచిన్ టెండూల్కర్, పేసర్ జహీర్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు.

20 ఏళ్ల క్రితం అంటే 2014లో ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్, స్పీడ్‌స్టర్ జహీర్ ఖాన్ 10వ వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అశ్విన్, జడేజాలు బంగ్లాదేశ్‌పై భారత్‌కు ఏడో వికెట్ లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యాన్ని అందించిన రికార్డును సృష్టించారు.

అంతేకాదు ఈ జోడీ 24 ఏళ్ల రికార్డును కూడా బ్రేక్ చేసింది. అంతకుముందు సౌరవ్ గంగూలీ, సునీల్ జోషిలు బంగ్లాదేశ్‌పై భారత్ 7వ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ 2000లో ఢాకా టెస్టు మ్యాచ్‌లో 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇప్పుడు ఆ రికార్డును అశ్విన్, జడేజా పంచుకున్నారు. రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్‌ల జోడీ ఇప్పటికీ అజేయంగానే ఉంది. కాబట్టి, రెండో రోజు ఆటలో ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటివరకు 227 బంతుల్లో అజేయంగా 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.




