- Telugu News Photo Gallery Cricket photos Ind vs aus wtc final 2023 australia won when travis heads hit century check 8 times records
WTC Final 2023, AUS vs IND: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓటమి డిసైడ్.. ఇదిగో పక్కా ప్రూఫ్..
WTC Final 2023: లండన్‌లోని ఓవల్‌లో నిన్న అంటే జూన్ 7న ప్రారంభమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయింది. హెడ్, స్మిత్ జోడీ భారత బౌలర్లను చితక్కొట్టి, సెంచరీలతో భారీ స్కోర్ సాధించారు.
Updated on: Jun 08, 2023 | 5:30 PM

జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే, తొలిరోజు భారత్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. ఆరంభంలో ఆధిపత్యం చెలాయించిన భారత్‌ను.. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌ల జోడీ చిత్తు చేసింది.

ఓవల్ వేదికగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రెండో సెషన్ ఆరంభానికి 3 వికెట్లు కోల్పోయి 76 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లారు. వీరిద్దరూ 251 పరుగులు జోడించి జట్టును 327 పరుగులకు చేర్చారు. అలాగే, ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు తొలిరోజు ముగిసే సమయానికి నాటౌట్‌గా నిలిచారు.

ముఖ్యంగా టీ20 క్రికెట్ దుమ్మురేపే హెడ్.. గత రెండేళ్లుగా టెస్టుల్లో రాణిస్తున్నాడు. రెండు నెలల క్రితం భారత పర్యటనలో సెంచరీని కోల్పోయాడు. కానీ, ఓవల్‌లో దానిని భర్తీ చేశాడు. కేవలం 106 బంతుల్లోనే తన టెస్టు కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేసుకున్న హెడ్.. 163 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు.

ట్రావిస్ హెడ్ చేసిన ఈ సెంచరీ ఆస్ట్రేలియాను సురక్షిత స్థితిలో ఉంచడమే కాకుండా ఆస్ట్రేలియాకు విజయాన్ని ఖాయం చేసినట్లు అనిపిస్తోంది. ఇందుకు ఓ కారణం కూడా ఉంది. ఇదే నిజమైతే భారత్‌కు ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.

హెడ్ ఓవల్‌లో సెంచరీకి ముందు, టెస్టులు, ODIలతో కలిపి మొత్తం 8 సెంచరీలు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లన్నింటిలోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ లెక్కన భారత్‌కు హెచ్ సెంచరీ తలనొప్పిగా మారింది.




