ICC Finals: కపిల్ దేవ్ నుంచి రోహిత్ శర్మ వరకు.. ఐసీసీ ఫైనల్స్‌లో భారత నాయకులు వీరే..

ICC Finals: మరో ఐసీసీ ఈవెంట్‌లో భారత్ ఫైనల్‌లో ఆడుతోంది. 2021-23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లండన్‌లోని ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుసగా రెండోసారి టెస్టు ప్రపంచకప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.

Venkata Chari

|

Updated on: Jun 08, 2023 | 9:04 PM

మరో ఐసీసీ ఈవెంట్‌లో భారత్ ఫైనల్‌లో ఆడుతోంది. 2021-23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లండన్‌లోని ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుసగా రెండోసారి టెస్టు ప్రపంచకప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. WTC ఫైనల్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ద్వారా ICC ఈవెంట్‌లో ఫైనల్‌లో టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించిన 5వ కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు.

1 / 9
చారిత్రాత్మక లార్డ్స్ స్టేడియంలో కపిల్ దేవ్ 1983 ODI ప్రపంచ కప్ విజయంతో టీమ్ ఇండియా మొదటి ICC ట్రోఫీని గెలుచుకుంది. అయితే అప్పుడు ఐసీసీ పేరు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కాదు. బదులుగా అది ఇంపీరియల్ క్రికెట్ కౌన్సిల్‌గా ఉంది. ఆ తర్వాత 1965లో అంతర్జాతీయ క్రికెట్ కాన్ఫరెన్స్‌గా మారింది. చివరకు 1987లో దాని ప్రస్తుత పేరు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌గా మారింది.

2 / 9
ఆ తర్వాత ఫైనల్‌లో టీమిండియాను నడిపించిన ఘనత సౌరవ్ గంగూలీకే దక్కుతుంది. దాదా 2000లో తొలిసారిగా టీమ్ ఇండియాను ఐసీసీ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేర్చాడు. ఐసీసీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగింది. సౌరవ్ నేతృత్వంలోని భారత్ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

3 / 9
సౌరవ్ నాయకత్వంలో భారత్ మరో రెండు ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్స్‌కు చేరుకుంది. 2002లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ శ్రీలంకలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. రిజర్వ్ డేకి కూడా వర్షం అంతరాయం కలిగించడంతో భారత్, శ్రీలంకలను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. సౌరవ్ 2003లో వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.

4 / 9
సౌరవ్ తర్వాత, మహేంద్ర సింగ్ ధోనీ 2007 T20 ప్రపంచ కప్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించాడు.

5 / 9
ఆ తర్వాత ధోనీ సారథ్యంలో మరో మూడు ఐసీసీ ఈవెంట్‌ల ఫైనల్స్‌లో ఆడిన భారత్ వాటిలో రెండింటిలో విజయం సాధించింది. 2011 ODI ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా అన్ని ICC ట్రోఫీలను గెలుచుకున్న ధోని.. భారత క్రికెట్ చరిత్రలో మొదటి కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత 2014లో ధోనీ సారథ్యంలో టీమిండియా మరో టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడింది.

6 / 9
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ధోని తర్వాత విరాట్ కోహ్లీ తొలిసారిగా ఐసీసీ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అయితే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయింది.

7 / 9
2021లో విరాట్ నాయకత్వంలో భారత్ తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి రిక్తహస్తాలతో వెనుదిరిగింది.

8 / 9
ఈ జాబితాలో చివరి కెప్టెన్ రోహిత్ శర్మ. మరో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో, రోహిత్ తొలిసారిగా ఐసీసీ ఈవెంట్‌లో ఫైనల్‌కు దేశాన్ని నడిపిస్తున్నాడు. భారత ఐసీసీ ట్రోఫీ కరువును అంతం చేసే సవాల్ వారి ముందు ఉంది.

9 / 9
Follow us