- Telugu News Photo Gallery Cricket photos IND Vs AUS Australi Star Player Glenn Maxwell Equals Rohit Sharma's Most T20I Centuries
Glenn Maxwell: భారత బౌలర్లను దంచికొట్టిన మాక్స్‌వెల్.. రోహిత్ శర్మ భారీ రికార్డ్‌లో ఆసీస్ డేంజరస్ ప్లేయర్..
IND vs AUS, Glenn Maxwell: భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ సమం చేశాడు. మ్యాక్స్ వెల్ 48 బంతుల్లో మొత్తం 8 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 104 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
Updated on: Nov 29, 2023 | 12:59 PM

భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు.

మ్యాక్స్ వెల్ 48 బంతుల్లో మొత్తం 8 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 104 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ ఫార్మాట్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌కి ఇది నాలుగో సెంచరీ. పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు.

తన 47 బంతుల్లో సెంచరీతో, మ్యాక్స్‌వెల్ పురుషుల T20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరపున వేగవంతమైన సెంచరీలు చేసిన ఆరోన్ ఫించ్, జోష్ ఇంగ్లిస్ రికార్డును సమం చేశాడు.

ఆసక్తికరంగా, ఇది ఆస్ట్రేలియాకు మాక్స్‌వెల్ 100వ T20 అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. రోహిత్ T20 రికార్డును సమం చేయడం ద్వారా మాక్స్‌వెల్ అతని సెంచరీని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు.

రోహిత్ శర్మ, గ్లెన్ మాక్స్‌వెల్ చెరో 4 సెంచరీలతో టాప్‌లో ఉండగా, బాబర్ ఆజం, సూర్యకుమార్ యాదవ్ 3 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు.

మ్యాక్స్‌వెల్ మ్యాచ్ చివరి నాలుగు బంతుల్లో భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో ఒక సిక్స్, వరుసగా మూడు ఫోర్లు కొట్టి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ని సజీవంగా ఉంచుకుంది.





























