- Telugu News Photo Gallery Cricket photos Happy Birthday Shikhar Dhawan, top 5 innings by team india star opener gabbar
Shikhar Dhawan Birthday: బ్యాటింగ్‌లో గబ్బర్ స్టేలే వేరు.. తొడగొట్టి, మీసం మెలేస్తే మైదానం దద్దరిల్లాల్సిందే.. కెరీర్‌లో ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇవే..!
ఆదివారం శిఖర్ ధావన్ తన 36వ పుట్టినరోజు వేడుకలు చేసుకోనున్నాడు. ఈ సందర్భంగా భారత డాషింగ్ ఓపెనర్ ఆడిన అత్యుత్తమ ఐదు ఇన్నింగ్స్‌లను ఓ సారి చూద్దాం..
Updated on: Dec 05, 2021 | 7:42 AM

శిఖర్ ధావన్ టీమిండియా తరపున అత్యంత దూకుడు ఓపెనర్లలో ఒకరిగా పేరుగాంచాడు. సౌత్‌పా ప్రస్తుతం ఒక దశాబ్దానికి పైగా భారతదేశ డ్రెస్సింగ్ రూమ్‌లో రెగ్యులర్‌గా ఉంటున్నాడు. అతను 2004 లో బంగ్లాదేశ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో మొత్తం 505 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను అందుకుని 'గబ్బర్'గా మారిపోయాడు. గబ్బర్ ఆడిన అత్యుత్తమ ఐదు ఇన్నింగ్స్‌లను ఓ సారి చూద్దాం..

ఆస్ట్రేలియాపై 174 బంతుల్లో 187 పరుగులు (2013, మొహాలీ): 2013లో ఆసీస్ జట్టు భారత పర్యటన సందర్భంగా జరిగిన రెడ్-బాల్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ధావన్ తన టెస్ట్ కెరీర్‌ను ధాటిగా ప్రారంభించాడు. మురళీ విజయ్‌తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన ధావన్.. తన మొదటి టెస్ట్‌లో 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 174 బంతుల్లో 33 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 187 పరుగులు సాధించాడు. రెండవ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేయలేదు. కానీ, గబ్బర్ అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మొహాలీ టెస్టులో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

4. శిఖర్ ధావన్: గత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో ధావన్ వేలంలో అందుబాటులో ఉంటాడు. గతేడాది ధావన్‌కు ఢిల్లీ రూ. 5.2 కోట్లు చెల్లించింది. 2014లో జరిగిన IPL వేలంలో ధావన్ అత్యధిక వేతనాన్ని రూ. 12.5 కోట్లకు SRH కొనుగోలు చేసింది.

శ్రీలంకపై 168 బంతుల్లో 190 పరుగులు (2017, గాలె): సుదీర్ఘ ఫార్మాట్‌లో శిఖర్ ధావన్ అత్యధిక స్కోరు 2017లో శ్రీలంకపై గాలేలో చేశాడు. 168 బంతుల్లో 190 పరుగులు చేయడంతో భారత్ 304 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఎడమచేతి వాటం గబ్బర్ ఇన్నింగ్స్‌లో 31 బౌండరీలు ఉన్నాయి. క్రీజులో దాదాపు నాలుగు గంటలు (235 నిమిషాలు) గడిపాడు.

దక్షిణాఫ్రికాపై 146 బంతుల్లో 137 పరుగులు (2015, మెల్‌బోర్న్): ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ రికార్డు బాగోలేదు. అయితే, 2015 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో ప్రోటీస్ జట్టును 130 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా భారత్ ఈ రికార్డును తిరగరాసింది. ఈ మ్యాచ్‌లో ధావన్ 146 బంతుల్లో 137 పరుగులు చేసి భారత బ్యాటింగ్‌కు నాయకత్వం వహించాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని దక్కించుకున్నాడు.

శ్రీలంకపై 90 బంతుల్లో 132* పరుగులు (2017, దంబుల్లా): టెస్ట్ సిరీస్‌లో శ్రీలంకను 3-0తో చిత్తు చేసిన తర్వాత, వన్డే సిరీస్‌లోనూ భారత్ సత్తా చాటింది. టీమ్ ఇండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించడంతో వన్డేలో ఘనంగా ప్రారంభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 216 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 127 బంతులు మిగిలి ఉండగానే తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 90 బంతుల్లో 132 పరుగులతో అజేయంగా నిలిచిన ధావన్ భారత్ తరపున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు.





























