- Telugu News Photo Gallery Cricket photos Gautam Gambhir says Rohit Sharma plays for team and not for centuries, fans think it’s a dig at Virat Kohli
Team India: సెంచరీల కోసం కాదు.. దేశం కోసమే ఆడతాడు: హిట్‌మ్యాన్‌పై గంభీర్ ప్రశంసలు.. ఫైరవుతోన్న కోహ్లీ ఫ్యాన్స్..
రోహిత్ శర్మ ఇప్పటికి 40-45 సెంచరీలు చేసి ఉండేవాడు. కానీ, సెంచరీలను అంతగా పట్టించుకోడు. అతను తన కోసం కాకుండా జట్టు కోసం ఆడతాడు.ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను ఇప్పటివరకు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా ఇలాగే దూసుకపోవాలని తెలిపాడు.
Updated on: Oct 30, 2023 | 7:20 PM

Rohit Sharma: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మను కొనియాడుతూ, ఇప్పటికే కెప్టెన్ రోహిత్ 40-45 సెంచరీలు చేసి ఉండేవాడంటూ తెలిపాడు. అయితే అతను తన కోసం కాకుండా జట్టు కోసం ఆడతాడు. అతను వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు ప్రదర్శనపై దృష్టి పెడతాడంటూ తేల్చి పారేశాడు.

రోహిత్ శర్మ తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 257 మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో అతను 31 సెంచరీలు చేశాడు. అతని పేరిట 54 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. వన్డే క్రికెట్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మకు సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ అతను ఔటయ్యాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆరంభం అంతగా రాణించకపోవడంతో భారత జట్టు 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నాలుగో వికెట్‌కు 91 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ జోడీ సెట్ అయ్యి జట్టును భారీ స్కోరుకు తీసుకెళ్తుందని అనిపించినప్పుడు, కేఎల్ రాహుల్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. రోహిత్ శర్మ 87 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.