Team India: వీళ్లు చెలరేగితే సీన్ సితారే.. 8వ సారి ఆసియా కప్ రోహిత్ సేనదే.. లిస్టులో ఐదుగురు..

Team India 5 Key Players in Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ జట్ల మధ్య జరగనుంది. భారత్‌ తొలి మ్యాచ్‌ పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 2న పల్లెకల్‌లో జరగనుంది. టీమ్ ఇండియాలోని ఐదుగురు ఆటగాళ్లు భారత్‌కు టైటిల్ అందజేయవచ్చు. వీళ్లు రాణిస్తే, టీమిండియా ఖాతాలో మరో ఆసియాకప్ ట్రోఫీ చేరనుంది.

Venkata Chari

|

Updated on: Aug 29, 2023 | 10:53 AM

Asia Cup 2023: ఆసియా కప్ 2023లో రోహిత్ సేన మొదటి మ్యాచ్ పాకిస్తాన్ టీంతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ టోర్నీలో భారత్‌కు టైటిల్‌ను అందించగల ఐదుగురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1 / 6
ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ జట్ల మధ్య జరగనుంది. భారత్‌ తొలి మ్యాచ్‌ పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 2న పల్లెకల్‌లో జరగనుంది. టీమ్ ఇండియాలోని ఐదుగురు ఆటగాళ్లు భారత్‌కు టైటిల్ అందజేయవచ్చు. ఇందులో మొదటి పేరు విరాట్ కోహ్లీదే. కోహ్లితో పాటు తిలక్ వర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ ఈ లిస్టులో ఉన్నారు.

2 / 6
యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ వెస్టిండీస్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత్ తరపున ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 174 పరుగులు చేశాడు. తిలక్ తన తుఫాన్ బ్యాటింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అందుకే ఆసియా కప్‌నకు జట్టులో చోటు దక్కించుకున్నాడు. తిలక్ రాణిస్తాడని అంతా భావిస్తున్నాడు.

3 / 6
వెస్టిండీస్‌పై ఇషాన్ కిషన్ వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. ఫామ్‌లో ఉన్న అతను ఇప్పుడు ఆసియా కప్‌లో రాణించగలడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇషాన్ వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.

4 / 6
అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భారత్‌ తరపున చాలా సందర్భాలలో అద్భుత ప్రదర్శన చేశాడు. అతను ఇప్పటివరకు 177 వన్డేల్లో 2560 పరుగులు చేశాడు. దీంతో పాటు 194 వికెట్లు తీశాడు. జడేజా పెద్ద మ్యాచ్‌లలో బాగా రాణిస్తున్నాడు.

5 / 6
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా పునరాగమనం చేశాడు. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నాలుగు వికెట్లు తీశాడు. గాయం కారణంగా బుమ్రా చాలా కాలం పాటు టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. అతను ఆసియా కప్‌లో టీమ్ ఇండియాకు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయగలడు.

6 / 6
Follow us