- Telugu News Photo Gallery Cricket photos From ravichandran ashwin to mohammad nabi these are oldest players in odi world cup 2023
Oldest Players in CWC 2023: వన్డే ప్రపంచ కప్ 2023లో అధిక వయసు గల ప్లేయర్లు వీరే.. లిస్టులో భారత్ నుంచి ఒకరు..
Cricket World Cup 2023: భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న ODI ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి మొదలు కానుంది. ఈప్రపంచ కప్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి. 13వ వన్డే ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతాయి. ప్రపంచకప్‌లో అత్యంత సీనియర్ ఆటగాళ్లుగా నిలిచిన ఐదుగురు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ లిస్టులో టీమిండియా నుంచి ఓ సీనియర్ ప్లేయర్ ఉన్నాడు.
Updated on: Oct 03, 2023 | 8:09 PM

వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభానికి ప్రస్తుతం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మెగా ఈవెంట్‌లో ఆడనున్న ఐదుగురు సీనియర్ (ఎక్కువ వయసు కలిగిన) ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న ODI ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి మొదలు కానుంది. ఈప్రపంచ కప్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి. 13వ వన్డే ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతాయి. ప్రపంచకప్‌లో అత్యంత సీనియర్ ఆటగాళ్లుగా నిలిచిన ఐదుగురు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ జట్టు తరపున ఆడుతున్న అత్యంత వయోవృద్ధ బ్యాట్స్‌మెన్ వెస్లీ బరేసి లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం వెస్లీ బరేసి వయస్సు 39 సంవత్సరాల 149 రోజులు. వెస్లీ ఇప్పటివరకు నెదర్లాండ్స్ జట్టు తరపున 45 ODIలు ఆడాడు. 2011 ప్రపంచ కప్ జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు.

నెదర్లాండ్స్ జట్టులో భాగమైన ఆల్ రౌండర్ వాన్ డెర్ మెర్వే వయస్సు పరంగా ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. వాన్ డెర్ మెర్వే వయస్సు ప్రస్తుతం 38 సంవత్సరాల 272 రోజులు. ఇప్పటి వరకు నెదర్లాండ్స్ జట్టు తరపున 16 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.

బంగ్లాదేశ్ వరల్డ్ కప్ జట్టులో భాగమైన స్పిన్ ఆల్ రౌండర్ మహ్మదుల్లా వయసు ప్రస్తుతం 37 ఏళ్ల 237 రోజులు. 2007లో బంగ్లాదేశ్ తరపున అరంగేట్రం చేసిన మహ్మదుల్లా.. వరుసగా నాలుగోసారి వన్డే ప్రపంచకప్‌లో భాగమయ్యాడు. మహ్మదుల్లా 2011లో తొలిసారి ప్రపంచకప్ ఆడాడు.

భారత వన్డే ప్రపంచకప్ జట్టులో చివరి మార్పులో, అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులో చేరాడు. ఈ జాజితాలో అశ్విన్ ఐదో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అశ్విన్ వయసు 37 ఏళ్ల 12 రోజులు. అశ్విన్ 2011, 2015 వన్డే ప్రపంచకప్ జట్లలో కూడా భాగమయ్యాడు.




