England vs Australia: ఒకేరోజు 510 పరుగులు.. డబుల్ సెంచరీతో దంచికొట్టిన ప్లేయర్.. ఎవరంటే?

England W A vs Australia W A: ఆస్ట్రేలియాతో జరిగే మహిళల యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు సిద్ధమైంది. ఇందుకోసం మహిళల జట్టుతో ఆస్ట్రేలియా-ఏ 3 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఏ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

Venkata Chari

|

Updated on: Jun 19, 2023 | 5:10 AM

ఆస్ట్రేలియాతో జరిగే మహిళల యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు సిద్ధమైంది. ఇందుకోసం మహిళల జట్టుతో ఆస్ట్రేలియా-ఏ 3 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఏ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

1 / 5
కానీ, ఇంగ్లండ్ మహిళల కారరువాక్ ధాటికి ఆస్ట్రేలియా ఏ జట్టు 221 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు టామీ బ్యూమాంట్ శుభారంభం అందించింది.

2 / 5
ఆరంభం నుంచే భీకర బ్యాటింగ్‌ను ప్రదర్శించిన టామీ బ్యూమాంట్‌ 31 ఫోర్లు, 1 సిక్స్‌ బాదింది. ఫలితంగా ఆమె కేవలం 238 బంతుల్లో 201 పరుగులు చేసింది. అలాగే, డబుల్ సెంచరీ తర్వాత టామీ బ్యూమాంట్ రిటైర్మెంట్ తీసుకుంది.

3 / 5
హీథర్ నైట్ 72 పరుగులు చేయగా, సోఫియా డంక్లీ 84 పరుగులు చేసింది. అలాగే నటాలియా స్కివర్ 78 బంతుల్లో 76 పరుగులు చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు స్కోరు ఒక్కరోజులోనే 500 పరుగుల మార్కును దాటింది.

4 / 5
ఆస్ట్రేలియాతో తొలిరోజు మ్యాచ్‌లో ఇంగ్లండ్ పురుషుల జట్టు 393 పరుగులు చేయగా, తొలిరోజు మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు 510 పరుగులు చేసింది. అంతే కాకుండా ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 650 పరుగులకు ఆలౌటైంది. 429 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఏ జట్టు చివరి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసి మ్యాచ్ ను డ్రా చేసుకోగలిగింది.

5 / 5
Follow us