Fastest Test Hundred: భారత బౌలర్లను ఏకిపారేసిన విదేశీ ప్లేయర్లు వీరే.. ఫాస్టెస్ట్ సెంచరీలతో ఊచకోత.. లిస్టులో ఎవరున్నారంటే?
India vs England 3rd Test: భారత్‌తో జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్‌లో సిడిసి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెన్ డకెట్ భారీ సెంచరీతో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ రికార్డు ఉన్నప్పటికీ, భారత్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రికార్డును డకెట్ బద్దలు కొట్టలేకపోయాడు. అయితే భారత్‌లో ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ చేసిన విదేశీ బ్యాట్స్‌మెన్ ఎవరు? ఇక్కడ సమాచారం ఉంది.
ఈ సెంచరీతో భారత్‌లో ఫాస్టెస్ట్ టెస్టు సెంచరీ చేసిన 3వ విదేశీ బ్యాట్స్‌మెన్‌గా డకెట్ రికార్డు సృష్టించాడు. అయితే, భారత్‌లో అత్యంత వేగంగా టెస్టు సెంచరీ సాధించిన విదేశీ బ్యాట్స్‌మెన్ ఎవరు? ఈ సెంచరీలు ఎప్పుడు చేశారు? ఇలాంటి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
Follow us
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా మైదానంలో భారత్‌తో జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో దూకుడు బ్యాటింగ్‌ను ప్రదర్శించిన డకెట్ కేవలం 88 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ సెంచరీతో భారత్‌లో ఫాస్టెస్ట్ టెస్టు సెంచరీ చేసిన 3వ విదేశీ బ్యాట్స్‌మెన్‌గా డకెట్ రికార్డు సృష్టించాడు. అయితే, భారత్‌లో అత్యంత వేగంగా టెస్టు సెంచరీ సాధించిన విదేశీ బ్యాట్స్‌మెన్ ఎవరు? ఈ సెంచరీలు ఎప్పుడు చేశారు? ఇలాంటి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
1- ఆడమ్ గిల్‌క్రిస్ట్: భారత్‌లో అత్యంత వేగంగా టెస్టు సెంచరీ సాధించిన విదేశీ బ్యాట్స్‌మెన్ రికార్డు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉంది. 2001లో ముంబైలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్ కేవలం 84 బంతుల్లో ఈ రికార్డు సృష్టించాడు.
2- క్లైవ్ లాయిడ్: ఆడమ్ గిల్‌క్రిస్ట్ కంటే ముందు, ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ పేరిట ఉంది. 1974లో బెంగళూరు వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో లాయిడ్ 85 బంతుల్లో సెంచరీ చేసి ఈ ప్రత్యేక రికార్డును లిఖించాడు. ఇప్పుడు భారత్‌లో తుఫాన్ సెంచరీ చేసిన విదేశీ బ్యాట్స్మెన్ల జాబితాలో లాయిడ్ రెండో స్థానంలో ఉన్నాడు.
3- బెన్ డకెట్: రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెన్ డకెట్ కేవలం 88 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో భారత్‌పై మెరుపు సెంచరీ సాధించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. భారత్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో విదేశీ బ్యాట్స్‌మెన్ కూడా.