- Telugu News Photo Gallery Cricket photos Bbl 2021 melbourne stars defeat brisbane heat by 20 runs joe clarke hilton cartwright hits half centuries
ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల వీరవిహారం.. 8 ఫోర్లు, 13 సిక్సర్లతో బౌలర్ల భరతం పట్టారు.. ఎవరో తెలుసా?
ఆ జట్టు కేవలం 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తక్కువ స్కోర్‌కే పరిమితమవుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇద్దరు బ్యాట్స్‌మెన్లు విజృంభించారు. ఇద్దరూ కలిసి 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు, ఆపై జట్టుకు 207 పరుగుల భారీ స్కోర్‌ను అందించారు. ఆ తర్వాత..
Updated on: Dec 28, 2021 | 3:50 PM

ఆ జట్టు కేవలం 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తక్కువ స్కోర్‌కే పరిమితమవుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇద్దరు బ్యాట్స్‌మెన్లు విజృంభించారు. ఇద్దరూ కలిసి 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు, ఆపై జట్టుకు 207 పరుగుల భారీ స్కోర్‌ను అందించారు. ఆ తర్వాత..

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ జరుగుతోంది. ఇందులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ల ఆటతీరు అంచనాలకు తగ్గట్టు లేకపోయినా.. బిగ్‌బాష్ లీగ్‌లో మాత్రం కొంతమంది ఇంగ్లీష్ బ్యాటర్లు తుఫాన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నారు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో క్లార్క్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ హిల్టన్ కార్ట్‌రైట్ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి తమ జట్టుకు విజయాన్ని అందించారు.

బీబీఎల్ 23వ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్, బ్రిస్బేన్ హీట్ జట్లు తలబడ్డాయి. ఇందులో టాస్ గెలిచి బ్రిస్బేన్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. మెల్‌బోర్న్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత ఇంగ్లీష్ జట్టు ఓపెనర్ జో క్లార్క్ కేవలం 44 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. క్లార్క్ తన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టాడు.

ఇదే సమయంలో, హిల్టన్ కార్ట్‌రైట్ తుఫాను ఇన్నింగ్స్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. కార్ట్‌రైట్ 44 బంతుల్లో 8 సిక్సర్లు, 1 ఫోర్‌తో 79 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 151 పరుగులు జోడించారు. అంటే ఈ ఇద్దరూ కలిసి 13 సిక్సర్లు, 8 ఫోర్లు నమోదు చేశారు.

దీనితో మెల్‌బోర్న్ 9 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక టార్గెట్ చేధించే క్రమంలో బ్రిస్బేన్ జట్టు 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో క్రిస్ లిన్ (57), బెన్ డకెట్ (54) అర్ధ సెంచరీలతో రాణించినప్పటికీ గెలుపుకు అడుగు దూరంలో ఆగిపోయారు. మెల్‌బోర్న్ బౌలర్లలో బ్రాడీ కౌచ్, కైస్ అహ్మద్‌లు చెరో 3 వికెట్లు పడగొట్టారు.




