- Telugu News Photo Gallery Cricket photos Asia cup 2023 from robin uthappa to kl rahul these 3 indian players most runs in odi debut check full list
ODI Debut: వన్డే అరంగేట్రంలో ఇరగదీసిన భారత ఆటగాళ్లు.. లిస్టులో ముగ్గురు.. అత్యధిక స్కోరర్ ఎవరంటే?
వీరిలో కొందరు ఆటగాళ్లు ఆరంభం నుంచి అద్భుతంగా రాణించగా, మరికొందరు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు అలవాటు పడేందుకు సమయం తీసుకున్నారు. తాజాగా ఆసియాకప్ 2023లో భాగంగా సూపర్ 4 చివరి మ్యాచ్‌లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీంలు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ వన్డే అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు.
Updated on: Sep 18, 2023 | 9:44 PM

Asia Cup 2023: ప్రతి క్రికెట్ ఆటగాడు ఏదో ఒక రోజు తన దేశం తరపున ఆడాలని కోరుకుంటాడు. వీరిలో కొందరి క్రీడాకారుల కలలు నెరవేరగా, మరికొందరి కలలు అలాగే ఉండిపోతాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘకాలం ఆడి అద్భుత ప్రదర్శన చేసిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఇక వన్డే క్రికెట్ గురించి చెప్పాలంటే.. అందులో ఇప్పటి వరకు ఎందరో గొప్ప ఆటగాళ్లను మనం చూశాం. రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి, మహ్మద్ అజారుద్దీన్, యువరాజ్ సింగ్ వంటి చాలా మంది గొప్ప వన్డే ఆటగాళ్లను భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసింది.

వీరిలో కొందరు ఆటగాళ్లు ఆరంభం నుంచి అద్భుతంగా రాణించగా, మరికొందరు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు అలవాటు పడేందుకు సమయం తీసుకున్నారు. తాజాగా ఆసియాకప్ 2023లో భాగంగా సూపర్ 4 చివరి మ్యాచ్‌లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీంలు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ వన్డే అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు భారత ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీరిలో సెంచరీ చేసిన క్రికెటర్ కూడా ఒకరు ఉన్నారు. ఆ ఆటగాడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు. కాబట్టి వన్డే అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 3 భారత ఆటగాళ్లు ఎవరో ఓ లుక్ వేయండి.

3. బ్రజేష్ పటేల్: తన కెరీర్‌లో 21 టెస్టులు, 10 వన్డే మ్యాచ్‌లు ఆడిన బ్రజేష్ పటేల్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. బ్రజేష్ పటేల్ తన వన్డే కెరీర్‌ను చాలా బాగా ప్రారంభించాడు. కానీ, అతను ఆ జోరును కొనసాగించలేకపోయాడు. కేవలం 10 ODI మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. 13 జులై 1974న లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై తన ODI అరంగేట్రం చేసాడు. ఆ మ్యాచ్‌లో బ్రజేష్ పటేల్ 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. కానీ, బ్రజేష్ పటేల్ భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత అతని ప్రదర్శన క్షీణించడంతో చాలా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.

2. రాబిన్ ఉతప్ప: ఈ జాబితాలో వెటరన్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప రెండో స్థానంలో ఉన్నాడు. ఉతప్ప 15 ఏప్రిల్ 2006న ఇండోర్‌లో ఇంగ్లాండ్‌పై తన ODI అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 86 పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్‌లో అత్యధిక ODI స్కోరు కూడా. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

1. కేఎల్ రాహుల్: వన్డే అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు కేఎల్ రాహుల్. ఇది కాకుండా వన్డే అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడు కేఎల్ రాహుల్. అతను 11 జూన్ 2016న జింబాబ్వేపై హరారేలో తన ODI అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను అజేయంగా 100 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందగా, తొలి మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సమయంలో అతను భారత జట్టులో కీలక ఆటగాడిగా మారాడు.





























