Sankranthi Festival: సంక్రాంతికి సరికొత్త పోటీలు.. విజేతలకు రూ. 10వేల నగదు బహుమతి..
అనకాపల్లి జిల్లాలో పుట్టీల (పుట్లు) పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఎస్ రాయవరం మండలం బంగారమ్మ పాలెంలోని వరాహ నదిలో జరిగిన పోటీల్లో మత్స్యకారులు పాల్గొన్నారు. ఈ పుట్టిల పోటీలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. విజేతలకు నగదు బహుమతులను అందించారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి 10వేలు, రెండో స్థానం సాధించిన వారికి 5వేలు, మూడో స్థానంలో ఉన్నవారికి 3వేల రూపాయల బహుమతిని అందించారు.
Updated on: Jan 17, 2024 | 12:35 PM

ఈ పుట్టిల పోటీలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. విజేతలకు నగదు బహుమతులను అందించారు.

మొదటి స్థానంలో నిలిచిన వారికి 10వేలు, రెండో స్థానం సాధించిన వారికి 5వేలు, మూడో స్థానంలో ఉన్నవారికి 3వేల రూపాయల బహుమతిని అందించారు.

నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ పోటీల్లో నదీ జలాల్లో రయ్యి రయ్యిమంటూ పుట్టిల్లో కూర్చొని ముందుకు దూసుకెళ్లారు. ఒకరితో ఒకరు తన శక్తి సామర్థ్యాలతో పుట్టిలతో ముందుకు వెళ్లారు.

అనకాపల్లి జిల్లాలో పుట్టీల (పుట్లు) పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఎస్ రాయవరం మండలం బంగారమ్మ పాలెంలోని వరాహ నదిలో జరిగిన పోటీల్లో మత్స్యకారులు పాల్గొన్నారు.

కొన్ని చోట్ల ఎడ్ల పోటీలు.. మరికొన్నిచోట్ల గుర్రం పోటీలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కామన్‌గా అనిపిస్తున్న వరాహనదిలో పుట్టీ ( పుట్లు) లు రయ్యి రయ్యి మంటూ దూసుకెళ్లాయి.

కోడి పందేలు లేని సంక్రాంతి సంబరాలు ఊహించుకోలేం. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో వేరువేరు రకాల పోటీల్లో సరదాగా సంబరాలు చేసుకుంటుంటారు ప్రజలు.




