- Telugu News Photo Gallery Cinema photos Bollywood star heroine Katrina Kaif said that Balakrishna is always my teacher
Balakrishna: ఎప్పటికీ బాలయ్యే నా గురువు అంటున్న బాలీవుడ్ స్టార్ హీరో భార్య..!
బాలయ్యేంటి.. నా గురువు అంటున్న స్టార్ హీరో భార్య ఏంటి..? అసలింతకీ ఎవరూ ఆ హీరో భార్య అనుకుంటున్నారు కదా..! మనం ఎంత ఎదిగినా కూడా నడిచివచ్చిన దారిని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎదగడానికి ఉపయోగపడిన ఏ ఒక్కరిని మర్చిపోకూడదు. అలా మర్చిపోతే కృతజ్ఞత లేనట్లే. ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకుంది కత్రినా కైఫ్.
Updated on: Jan 17, 2024 | 1:06 PM

దాదాపు 20 ఏళ్ళ కింద బాలకృష్ణతో నటించిన విషయాన్ని గుర్తు చేసుకుని అప్పుడు ఆయన చెప్పిన కొన్ని జాగ్రత్తలు ఇప్పటికీ పాటిస్తుంది కత్రినా కైఫ్. అందుకే బాలయ్య తన గురువు ఉంటుంది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పింది కత్రినా. అయితే కెరీర్ కొత్తలో మాత్రం రెండు తెలుగు సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.

వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లీశ్వరితో ఇక్కడ ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్.. ఆ వెంటనే బాలకృష్ణతో అల్లరి పిడుగు సినిమాలో నటించింది కత్రినా. అది మాత్రం డిజాస్టర్ అయ్యింది. కానీ బాలయ్యతో పరిచయం కత్రినా జీవితాన్ని మార్చేసింది. దీని వెనుక పెద్ద కథ ఉంది. కెరీర్ మొత్తంలో కత్రినా కైఫ్ డాన్స్ దారుణంగా ఉండేది.. అసలు వచ్చేది కాదు.

మల్లీశ్వరి సినిమాలో కూడా ఏదో కవర్ చేసింది. ఆమె డాన్స్ చూసి నవ్వుకునే వాళ్ళు.. అలాంటి సమయంలో బాలయ్య అల్లరి పిడుగు సినిమాలో కచ్చితంగా డాన్స్ చేయాల్సిన సందర్భం వచ్చింది. దాంతో కత్రినా బాధను అర్థం చేసుకున్న బాలయ్య కొన్ని మెళుకువలు చెప్పాడు. ఆయన చెప్పిన విషయాన్ని గుర్తు పెట్టుకొని.. ఆ మెలకువలను పాటిస్తూ డాన్స్ నేర్చుకుంది కత్రినా కైఫ్.

ఇప్పుడు బాలీవుడ్‌లో ఉన్న బెస్ట్ డాన్సర్స్ లో ఈమె కూడా ఒకరు. ముఖ్యంగా కత్రినా కైఫ్ చేసిన కొన్ని ఐటమ్ సాంగ్స్ సంచలనం సృష్టించాయి. ఈ రోజు ఇంత బాగా డ్యాన్స్ చేస్తోంది అంటే ఆ రోజు బాలయ్య చెప్పిన కొన్ని మెలకువలు కారణం. ఈ విషయాన్ని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది కత్రినా కైఫ్. నిజానికి అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు.

కానీ డాన్స్ క్రెడిట్ మాత్రం బాలయ్యకు ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. డాన్స్‌లో తన గురువు బాలకృష్ణ అంటుంది. ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు కత్రినాకు కూడా ఫ్యాన్స్ అయిపోయారు. రెండేళ్ళ కింద బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్‌ను పెళ్ళి చేసుకుంది కత్రినా. ప్రస్తుతం ఇద్దరూ ఈ భార్యా భర్తలిద్దరూ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.




