కొత్త సినిమా ఏది విడుదలైనా.. ముందు నెగిటివ్ రివ్యూస్ వచ్చాకే రియల్ రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఆ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కథలో దమ్ముంటే మాత్రం.. నెగిటివ్ రివ్యూస్ ఆపలేవని దసరా, ఖుషీతో పాటు చాలా జైలర్, బేబీ, విరూపాక్ష లాంటి చాలా సినిమాలు నిరూపించాయి. ఒక్కటి మాత్రం నిజం.. సోషల్ మీడియా సినిమాలకు ఎంత ప్లస్ అవుతుందో.. అంతే మైనస్ కూడా అవుతుంది.