తక్కువ గ్యాప్‌లోనే ఓజి, వీరమల్లు పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు ఎన్నికలకు అస్త్రంగా భావిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌ను కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్. దీనికోసం స్పెషల్‌గా డేట్స్ అలాట్ చేసారు కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందే ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ రానున్నాయి.. కానీ ఇప్పుడు వీరమల్లు కూడా ముందే వస్తుందని క్లారిటీ ఇచ్చారు ఏఎం రత్నం. మొత్తానికి లెక్కలు బాగున్నాయి.. కానీ వర్కవుట్ అయినపుడే ఫ్యాన్స్‌కు ఆనందం.