- Telugu News Photo Gallery Cinema photos Salaar Postponed, Small Films Set To Release On September 28
క్రేజీ న్యూస్.. మహేష్ పవన్ కాంబో.. ప్రభాస్ తప్పుకోవడంతో.. రెచ్చిపోతున్న యంగ్ హీరోలు
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో వస్తుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా కథ పరంగా నేపథ్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని.. అందుకే ఈ కథను ముందుకు తీసుకెళ్లడం కోసం ఓ పవర్ ఫుల్ వాయిస్ కోసం త్రివిక్రమ్ చూస్తున్నట్లు తెలుస్తుంది. దానికోసం పవన్ కళ్యాణ్‌ను అడిగారని ప్రచారం జరుగుతుంది. పవన్ అయితే ఈ వాయిస్ బాగా సూట్ అవుతుందని మేకర్స్ నమ్మకం. గతంలో పవన్ జల్సా కోసం మహేష్ వాయిస్ అందించారు.
Updated on: Sep 05, 2023 | 7:33 PM

Gunturu Karam: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో వస్తుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా కథ పరంగా నేపథ్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని.. అందుకే ఈ కథను ముందుకు తీసుకెళ్లడం కోసం ఓ పవర్ ఫుల్ వాయిస్ కోసం త్రివిక్రమ్ చూస్తున్నట్లు తెలుస్తుంది. దానికోసం పవన్ కళ్యాణ్‌ను అడిగారని ప్రచారం జరుగుతుంది. పవన్ అయితే ఈ వాయిస్ బాగా సూట్ అవుతుందని మేకర్స్ నమ్మకం. గతంలో పవన్ జల్సా కోసం మహేష్ వాయిస్ అందించారు.

Rules Ranjan: ప్రభాస్ సలార్ రేస్ నుంచి తప్పుకోవడంతో ఒక్కసారిగా చిన్న సినిమాల నిర్మాతలు, దర్శకులు, హీరోలు అలెర్ట్ అయిపోయారు. తమ సినిమాలు అదే డేట్‌కు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 28న కర్చీఫ్ వేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే మొన్న సితార ఎంటర్‌టైన్మెంట్స్ తమ మ్యాడ్ సినిమాను అదే రోజు ప్రకటించగా.. ఇప్పుడు రూల్స్ రంజన్ సినిమాను కూడా సెప్టెంబర్ 28నే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Kushi: విజయ్ దేవరకొండ ఖుషి మొదటి వీకెండ్ బాగా యూజ్ చేసుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఏకంగా 70 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. కేవలం యుఎస్‌లోనే మూడు రోజుల్లో 1.4 మిలియన్ డాలర్లతో దుమ్ము దులిపింది. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే నైజామ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంది ఖుషి. సీడెడ్, ఆంధ్రలోనూ పర్లేదనే వసూళ్లు తీసుకొస్తుంది. వీక్ డేస్ సినిమాకు వచ్చే వసూళ్లను బట్టి రేంజ్ అర్థమవుతుంది.

Samantha: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, నిందలు పడ్డా తొణకకుండా ఎలా ముందుకు సాగాలో నేర్చుకోవాలంటే సమంతను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు గాయని చిన్మయి. అనారోగ్యం కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యమైతే, సమంత పారితోషికాన్ని తగ్గించుకున్నారని తెలిపారు. డబ్బు వద్దనుకునేవారు ఈ కాలంలో ఎవరుంటారని అన్నారు.

Bhagavanth kesari: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని కీలక షెడ్యూల్‌ని హైదరాబాద్ పరిసరాల్లో తెరకెక్కిస్తున్నారు. పది రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. తెలంగాణ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ సినిమా ఇది.

Naveen Polishetty: నవీన్ పొలిశెట్టి, అనుష్క నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా ప్రొడక్షన్‌కి ఎక్కువ టైమ్ పట్టిందని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వల్ల మూవీ రిలీజ్ కూడా ఆలస్యమైందని అన్నారు. ఈ తప్పు జరిగినందుకు క్షమించమని కోరారు నవీన్ పొలిశెట్టి. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సెప్టెంబర్ 7న విడుదల కానుంది.




