లేట్ కావచ్చు.. కానీ వచ్చుడు పక్కా !! అసలు రిలీజ్ ఎప్పుడు.? కన్ఫూజన్ లో సలార్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ రోజు నుంచి రెజ్యూమ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. డైరెక్టర్ హరీష్ శంకర్ ఆయుధాలతో దిగిన ఫోటోను షేర్ చేసి, యాక్షన్ సీన్ చిత్రీకరణ జరగబోతుందన్న క్లారిటీ ఇచ్చింది.సలార్ రిలీజ్ డేట్ విషయంలో డైలమా కొనసాగుతోంది. రిలీజ్ వాయిదా పడుతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంత వరకు అధికారికంగా స్పందించలేదు.
Updated on: Sep 05, 2023 | 7:29 PM

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ రోజు నుంచి రెజ్యూమ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. డైరెక్టర్ హరీష్ శంకర్ ఆయుధాలతో దిగిన ఫోటోను షేర్ చేసి, యాక్షన్ సీన్ చిత్రీకరణ జరగబోతుందన్న క్లారిటీ ఇచ్చింది.

Salaar: సలార్ రిలీజ్ డేట్ విషయంలో డైలమా కొనసాగుతోంది. రిలీజ్ వాయిదా పడుతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంత వరకు అధికారికంగా స్పందించలేదు. తాజాగా సలార్ అఫీషియల్ ట్విటర్ పేజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌కు సంబంధించిన అప్‌డేట్ షేర్ చేయటంతో వాయిదా వార్తలు రూమర్సేనా అన్న అనుమానం కలుగుతోంది.

Pushpa: పుష్ప సినిమాకు సీక్వెల్ గా సుకుమార్ డైరెక్షన్లో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న పాన్ ఇండియన్ సీక్వెల్ సినిమా పుష్ప2. ఇక ఇప్పటికే ఐకాన్ స్టార్ కెరీర్లో ఎవరెస్ట్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న ఈసినిమా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కు సంబంధించిన ఓ న్యూస్ ఫిల్మ్ సిటీలో చక్కర్లు కొడుతోంది. ఇక అకార్డింగ్ టూ ఆ న్యూస్...! పుష్ప2 సినిమా కోసం బయర్ల మధ్య తీవ్ర పోటీ ఉందట. దాంతో అన్ని ఏరియాల థియేట్రికల్ రైట్స్‌ను.. దాంతో పాటే నాన్ థియేట్రికల్ రైట్స్ ను కలుపుకుని ఈ సినిమా వెయ్యి కోట్ల వరకు బిజినెస్ చేసిందట. దీనికి మించేలా ఇంకొన్ని భేరసారాలు కూడా జరుగుతున్నాయట.

Kushi: విజయ్ దేవరకొండ ఖుషి మొదటి వీకెండ్ బాగా యూజ్ చేసుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఏకంగా 70 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. కేవలం యుఎస్‌లో ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లతో దుమ్ము దులిపింది. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే నైజామ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంది ఖుషి.

Skanda: సలార్ వాయిదా పడిందనే విషయం తెలియగానే.. సెప్టెంబర్ 28పై ఖర్చీఫ్ వేసారు రామ్. ఈయన స్కంద సెప్టెంబర్ 15 నుంచి 28కి ఫిక్స్ అయింది. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న స్కంద సెప్టెంబర్ 15న విడుదల చేయాలనుకున్నారు.. కానీ కొన్ని కారణాలతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28కి ఫిక్స్ చేసారు. అదే రోజు సితార ఎంటర్‌టైన్మెంట్స్ మ్యాడ్‌తో పాటు ఏఎం రత్నం నిర్మిస్తున్న రూల్స్ రంజన్ కూడా రిలీజ్ కాబోతున్నాయి.

Mark Antony: విశాల్ డ్యుయల్ రోల్‍లో నటిస్తున్న చిత్రం 'మార్క్ ఆంటోనీ'. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో గ్యాంగ్‍స్టర్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘మార్క్ ఆంటోనీ’ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. దాంతో హీరో విశాల్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెప్పుకొచ్చారు ఈ యాక్షన్ హీరో




