- Telugu News Photo Gallery Cinema photos What is Harish Shankar's plan, who will be the hero of his next film?
Harish Shankar: హరీష్ శంకర్ ప్లాన్ ఏంటి.? నెక్స్ట్ మూవీ హీరో ఎవరు.?
భారీ భారీ సక్సెస్‌లు వచ్చినవాళ్లే.. నిలిచి నిదానంగా అడుగులు వేస్తున్నారు. అలాంటిది ఈ సారి ష్యూర్ షాట్ హిట్ కొట్టి తీరాల్సిందేనన్న ఆలోచనతో ఉన్న కెప్టెన్ ఏం చేయాలి? పవర్‌స్టార్ సినిమా గురించి లీక్స్ ఇచ్చినా.. అంతకన్నా ముందు ఏం చేస్తారంటే.. ఆన్సర్ ఏం వినిపిస్తోందో తెలుసా?
Updated on: Feb 21, 2025 | 11:10 PM

ఉస్తాద్ భగత్‌సింగ్ కోసం రమణగోగులతో పాట పాడించాలనుకున్నాం. ఉస్తాద్ భగత్‌సింగ్‌లో పవర్‌స్టార్ కారు మీద కూర్చుని ట్రావెల్ చేసే సీన్ ఉంటుంది.. అంటూ రకరకాల లీక్స్ ఇచ్చేస్తున్నారు కెప్టెన్ హరీష్ శంకర్.

పవన్ కల్యాణ్‌కి ఎట్ ప్రెజెంట్ సెట్స్ మీదున్న హరహర వీరమల్లు, ఓజి అనే రెండు సినిమాలు రిలీజ్ అయితేగానీ ఉస్తాద్ భగత్‌సింగ్ మీద ఫోకస్ చేసే తీరిక లేదన్నది అందరికీ తెలిసిన విషయం. పవర్‌స్టార్ పిలిచి కాల్షీట్ ఇచ్చేవరకు హరీష్ ఏం చేస్తారు? అనేది అందరినీ ఊరిస్తున్న టాపిక్.

Mr. కాంబినేషన్ కుదిరిందని మాస్ మహరాజ్‌తో మిస్టర్ బచ్చన్ చేశారు. ప్రమోషన్స్ చేసిన తీరు, భాగ్యశ్రీ గ్లామర్, కాంబో మీద క్రేజ్‌తో.. సినిమాకు ప్రీ రిలీజ్ టైమ్‌లో పాజిటివ్ బజ్ వచ్చింది. కానీ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయింది టీమ్.

మరి ఇప్పుడు హరీష్ ఏం చేస్తారు? ఆ మధ్య బాలయ్యకు కథ చెబుతున్నారనే టాక్ వచ్చింది. ఆ తర్వాత లైనప్‌లో రామ్ సినిమా ఉందన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరితో హరీష్ ట్రావెల్ అవుతున్నారా?

మరేదైనా ప్లానింగ్‌లో ఉన్నారా.. ఎవరితో సినిమా చేసినా పర్ఫెక్ట్ సినిమా కచ్చితంగా పడాలి ఈ కెప్టెన్‌కి. హరీష్ శంకర్ మనసులో ఏముంది.? మరో హీరోతో సినిమా ప్లాన్ చేస్తారా.? పవర్స్ డేట్స్ కోసం ఎదురు చూస్తారా.?




