Leo: విజయ్ లియో ట్రైలర్ విడుదల.. పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ
మోస్ట్ అవైటెడ్ లియో ట్రైలర్ వచ్చేసింది. మరి ఇందులో విజయ్ ఎలా ఉన్నారు..? సంజయ్ దత్ కారెక్టర్ ఏంటి..? త్రిష ఏం చేయబోతున్నారు..? లోకేష్ కనకరాజ్ తన మ్యాజిక్ కంటిన్యూ చేస్తారా..? దసరాకు బాలయ్య, రవితేజతో పోటీ పడేంత కంటెంట్ లియోలో ఉందా..? లియో ట్రైలర్‌పై స్పెషల్ స్టోరీ..ఒకప్పుడు విజయ్ సినిమా తెలుగులో వస్తుందంటే పోస్టర్ ఖర్చులు కూడా రావు ఎందుకు దండగ అనేవాళ్లు. కానీ ఇప్పుడు ఆయన పోస్టర్ కనిపిస్తే బొమ్మ బ్లాక్‌బస్టర్ అంటున్నారు.
Updated on: Oct 06, 2023 | 9:57 PM

మోస్ట్ అవైటెడ్ లియో ట్రైలర్ వచ్చేసింది. మరి ఇందులో విజయ్ ఎలా ఉన్నారు..? సంజయ్ దత్ కారెక్టర్ ఏంటి..? త్రిష ఏం చేయబోతున్నారు..? లోకేష్ కనకరాజ్ తన మ్యాజిక్ కంటిన్యూ చేస్తారా..? దసరాకు బాలయ్య, రవితేజతో పోటీ పడేంత కంటెంట్ లియోలో ఉందా..? లియో ట్రైలర్‌పై స్పెషల్ స్టోరీ..

ఒకప్పుడు విజయ్ సినిమా తెలుగులో వస్తుందంటే పోస్టర్ ఖర్చులు కూడా రావు ఎందుకు దండగ అనేవాళ్లు. కానీ ఇప్పుడు ఆయన పోస్టర్ కనిపిస్తే బొమ్మ బ్లాక్‌బస్టర్ అంటున్నారు. వరస విజయాలతో టాలీవుడ్‌లోనూ మార్క్ క్రియేట్ చేసుకున్నారు దళపతి. ఐదేళ్ళ కింద అదిరిందితో మొదలైన విజయ్ మేనియా.. సర్కార్, విజిల్, వారసుడు అంటూ కొనసాగుతూనే ఉంది.

లియో ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఇందులో త్రిష హీరోయిన్. విజయ్‌తో 14 ఏళ్ళ తర్వాత నటిస్తున్నారు త్రిష. చివరగా 2008లో వీరిద్దరూ కురువిలో కలిసి నటించారు. లియో కచ్చితంగా జైలర్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ అంచనా. విజయ్ ట్రాక్ రికార్డ్ అలా ఉంది మరి. మరోవైపు ట్రైలర్‌లోనూ యాక్షన్ సీక్వెన్సులు అదిరిపోయాయి.

బిజినెస్ పరంగానూ లియో సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమా ఏకంగా 230 కోట్ల బిజినెస్ చేసింది. తెలుగులో 22 కోట్లకు సితార ఎంటర్‌టైన్మెంట్స్ సొంతం చేసుకున్నారు.

లోకేష్ కనకరాజ్ ట్రాక్ రికార్డ్ అంచనాలు మరింత పెంచేస్తుంది. సంజయ్ దత్, అర్జున్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 19న లియో విడుదల కానుంది.




