Saindhav: సంక్రాంతి బరిలో వెంకీ మామ.. ఈ సారి మాములుగా ఉండదు
మనలో మన మాట సంక్రాంతికి నిజంగా అన్ని సినిమాలు వస్తాయంటారా..? ఒకరి తర్వాత ఒకరు పండక్కి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అరడజన్ సినిమాలక్కడ లైన్‌లో ఉంటే.. వెంకటేష్ కూడా వచ్చి క్యూలోలో నిల్చున్నారు. అసలు వెంకీ ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు.. గతంలో సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ సినిమాలేంటి..? సంక్రాంతి అంటే ఏ హీరోకు మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి..? ముఖ్యంగా సీనియర్ హీరోలైతే పండక్కి తమ సినిమా తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.
Updated on: Oct 06, 2023 | 9:53 PM

మనలో మన మాట సంక్రాంతికి నిజంగా అన్ని సినిమాలు వస్తాయంటారా..? ఒకరి తర్వాత ఒకరు పండక్కి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అరడజన్ సినిమాలక్కడ లైన్‌లో ఉంటే.. వెంకటేష్ కూడా వచ్చి క్యూలోలో నిల్చున్నారు. అసలు వెంకీ ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు.. గతంలో సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ సినిమాలేంటి..?

సంక్రాంతి అంటే ఏ హీరోకు మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి..? ముఖ్యంగా సీనియర్ హీరోలైతే పండక్కి తమ సినిమా తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. వెంకటేష్‌కు సైతం సంక్రాంతి హీరో అనే పేరుంది. 35 ఏళ్ళ కెరీర్‌లో పండక్కి 13 చిత్రాలు విడుదల చేసారు వెంకటేష్. ఈయన కెరీర్‌ను మార్చిన సినిమాలన్నీ సంక్రాంతికే వచ్చాయి.

తాజాగా 2024 సంక్రాంతికి సైంధవ్‌తో రానున్నారు వెంకటేష్. జనవరి 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇది వెంకటేష్‌కు 75వ సినిమా కావడం గమనార్హం. హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకుడు. 1988 నుంచే వెంకటేష్ సంక్రాంతి వేట మొదలైంది. తొలిసారి అప్పుడే రక్తతిలకంతో వచ్చి హిట్ కొట్టారీయన. ఆ మరుసటి ఏడాది ప్రేమ సినిమాతో వచ్చారు.

1992 సంక్రాంతికి విడుదలైన చంటి వెంకటేష్ కెరీర్‌ను మార్చేసింది. దీని తర్వాత పండగ వెంకటేష్‌కు కొన్నేళ్ల పాటు కలిసిరాలేదు. 1995లో పోకిరి రాజా, 96లో ధర్మచక్రం, 97లో చిన్నబ్బాయి వెంకటేష్‌ను నిరాశ పరిచాయి. కానీ 2000లో కలిసుందాం రాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇక 2001లో దేవీ పుత్రుడు ప్రశంసలు తీసుకురాగా.. 2006లో లక్ష్మీ కాసుల వర్షం కురిపించింది.

2010లో అదుర్స్‌కు పోటీగా విడుదలైన నమో వెంకటేష యావరేజ్‌గా నిలిచింది. ఆ తర్వాత రెండేళ్లకు బాడీగార్డ్‌తో వచ్చినా ఫలితం ఫ్లాపే. ఇక 2013 సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో అంటూ మహేష్‌తో పాటు వచ్చి హిట్ కొట్టారు వెంకీ. 2015 గోపాలా గోపాలా, 2019 ఎఫ్ 2 లాంటి సినిమాలు వెంకటేష్‌కు పండగను సెంటిమెంట్‌గా మార్చేసాయి. ఐదేళ్ళ తర్వాత సైంధవ్‌తో మరోసారి పండగ రేసులోకి వస్తున్నారు వెంకటేష్.




