ఫస్ట్ పార్ట్ హిట్టైతే.. సీక్వెల్‌కు చెప్పలేనంత క్రేజ్ వస్తుంది. అందుకే దేవరతో పాటు సలార్, ఓజి, హరిహర వీరమల్లు లాంటి సినిమాలను కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాకు 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందుకే రికవరీ కోసం 2 పార్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎలా చూసుకున్నా 2 పార్ట్స్ అనేది కేవలం బిజినెస్ ప్లానింగ్‌లాగే వాడుకుంటున్నారు మన దర్శకులు.