- Telugu News Photo Gallery Cinema photos Vijay Deverakonda's Kingdom Movie Gets Postponed know New Release Date Here
Kingdom: రౌడీ హీరో మాస్ స్కెచ్ మాములుగా లేదుగా.. మాంచి బజ్ క్రియేట్ చేస్తున్న విజయ్
మే 30 రిలీజ్ కావాల్సిన కింగ్‌డమ్ సినిమాను వాయిదా వేసింది చిత్రయూనిట్. మే అంటే మంచి హాలీడే సీజన్, ఈ టైమ్‌ను కాదని స్కూల్స్, కాలేజెస్ బిగిన్ అయిన తరువాత రిలీజ్ చేయటం వెనుక రీజనేంటి? అసలు కింగ్‌డమ్ విషయంలో రౌడీ హీరో ప్లానింగ్ ఏంటి? రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్.
Updated on: May 15, 2025 | 6:33 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీని మే 30న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.

రీసెంట్ అప్‌డేట్స్‌లోనూ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ లేదన్న సిగ్నల్స్ ఇచ్చారు. కానీ సడన్‌గా విడుదల వాయిదా వేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది రౌడీ టీమ్. ఈ వాయిదా వెనుక పెద్ద స్కెచ్చే వేశారు విజయ్ దేవరకొండ.

ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది మూవీ టీమ్. మరో వైపు దేశమంతా ఐపీఎల్ హీట్ కంటిన్యూ అవుతోంది. ఈ పరిస్థితుల్లో హడావిడిగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం కన్నా... కావాల్సినంత టైమ్ తీసుకొని పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రిలీజ్ చేయాలన్నది కింగ్‌డమ్ టీమ్ ప్లానింగ్.

కింగ్‌డమ్ కథకు నేషనల్ లెవల్‌లో ప్రూవ్ చేసుకునే సత్తా ఉందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. అందుకే పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్స్ కోసం టైమ్ కావాలన్న ఉద్దేశంతోనే రిలీజ్‌ను వాయిదా వేసింది టీమ్. జూన్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసి నెల రోజుల పాటు దేశమంతా చుట్టేసేలా ఈవెంట్స్‌కు రెడీ అవుతున్నారు రౌడీ హీరో.

మే 30న రావాల్సిన సినిమా వాయిదా పడటం అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టినా... జూలై 4 డేట్ విషయంలో హ్యాపీగానే ఉన్నారు. ఈ గ్యాప్‌లో సినిమా మీద క్రియేట్ అయ్యే బజ్, రౌడీ హీరో ప్లానింగ్, కింగ్‌డమ్ టీమ్ కాన్ఫిడెన్స్ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్‌కు రెడీ అయిపోతున్నారు రౌడీ బాయ్స్.




