- Telugu News Photo Gallery Cinema photos Vijay Deverakonda and Keerthy Suresh New Movie Pooja Ceremony Photos Goes Viral
Vijay Deverakonda: కొత్త సినిమా స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ.. హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
ఇటీవలే కింగ్డమ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు రౌడీ హీరో విజయ్. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో విజయ్ జోడిగా భాగ్య శ్రీ బోర్సే నటించింది. ఇక ఇప్పుడు విజయ్ తన కొత్త సినిమా రౌడీ జనార్ధన్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇంతకీ ఇందులో హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
Updated on: Oct 11, 2025 | 12:32 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ శనివారం ఉదయం తన కొత్త సినిమా రౌడీ జనార్ధన్ చిత్రాన్ని ప్రారంభించారు. రాజా వారు రాణి గారు సినిమాతో మెప్పించిన క్లాసిక్ డైరెక్టర్ రవికిరణ్ ఇప్పుడు విజయ్ తో భారీ యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. గతంలో వీరిద్దరు కలిసి మహానటి చిత్రంలో నటించారు. అయితే అప్పుడు సినిమాలో కీలకపాత్ర పోషించిన.. ఇప్పుడు కీర్తితో జతకట్టనున్నారు. ఇందులో వీరిద్దరు జోడిగా కనిపించనున్నారు.

గతేడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి.. పెళ్లి తర్వాత చేస్తున్న ఫస్ట్ భారీ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా శనివారం ఉదయం ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఎస్వీసీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో నటుడు రాజశేఖర్ విలన్ గా కనిపించనున్నారని టాక్.

రౌడీ జనార్దన్ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ వేడకలో పట్టు పరికిణిలో మరింత అందంగా కనిపిస్తుంది కీర్తి సురేష్. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




