- Telugu News Photo Gallery Cinema photos Vijay Devarakonda upcoming movie update details on 27 01 2025
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు సీన్ అంతా అర్థమైందిగా
విజయ్ దేవరకొండ ప్లాన్ మార్చేస్తున్నారు. ఇప్పటికే చేయాల్సిన రిస్క్‌లన్నీ చేసిన రౌడీ బాయ్.. ఇకపై నో రిస్క్.. ఓన్లీ ఫోకస్ అంటున్నారు. సెట్స్‌పై ఉన్న సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి VD12 కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు..? ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? తర్వాతి సినిమాల కథేంటి..?
Updated on: Jan 27, 2025 | 9:00 PM

విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఎవరి దిష్టో బాగా బలంగా తగిలేసింది. కెరీర్ మొదట్లో రాకెట్‌లా దూసుకుపోయిన రౌడీ బాయ్.. ఆ తర్వాత జోరు తగ్గించారు. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ బెడిసికొడుతున్నాయి.

ఖుషీ ఓకే అనిపించిందని ఆనందించేలోపే.. ఫ్యామిలీ స్టార్ దెబ్బ పడిపోయింది. అయితే ఈ మధ్యే కల్కిలో అర్జునుడిగా మెరిసారు విజయ్. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండలో మార్పులు భారీగానే కనిపిస్తున్నాయి.

గతంలో లైగర్ చేస్తున్నపుడే ఖుషీ.. అది సెట్స్‌పై ఉన్నపుడే గౌతమ్ సినిమా.. అది పూర్తవ్వక ముందే ఫ్యామిలీ స్టార్‌కి ఓకే చెప్పారు విజయ్. ఇకపై ఈ కన్ఫ్యూజన్స్ వద్దు.. ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అంటున్నారు.

ఇప్పటికే 2 సినిమాలు ఫైనల్ అయినా.. నిదానమే ప్రధానం అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమాలో పోలీస్‌గా నటిస్తున్నారు విజయ్. ఇది పూర్తయ్యాక రాహుల్ సంక్రీత్యన్ సినిమా సెట్స్‌పైకి రానుంది.

ప్రస్తుతం ఈ చిత్ర సెట్ వర్క్ మొదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 18వ శతాబ్ధపు కథతో తెరకెక్కనుంది. ఇక రవికిరణ్ కోలా సినిమా పూర్తిగా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రానుంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత.




