Pawan Kalyan: ద పవర్.. ద స్టార్.. ద కింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ బోనంజా.. గెట్ రెడీ..!
సెప్టెంబర్ 2.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన అభిమానులకు..సారీ, సారీ ఆయన భక్తులకు పండుగ రోజు. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కరోనా కారణంగా పవన్ కోరిక మేరకు కాస్త వెనక్కి తగ్గినా.. ఎట్‌లీస్ట్ సోషల్ మీడియాలో అయినా దుమ్ము రేపుతారు.
Updated on: Aug 26, 2021 | 12:17 PM

కాగా ఈసారి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజున అభిమానులకు రెండు భారీ సర్ప్రైజ్లు రానున్నట్లు సమాచారం అందుతోంది.

పవన్‌కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ఇండియా మూవీ 'హరిహర వీరమల్లు' నుంచి కీలక అప్డేట్ రానుందని సమాచారం. దాంతో పాటు సినిమా రిలీజ్ డేట్‌నూ ప్రకటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.

ఇక మలయాళ సూపర్‌హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌లో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్-రానా దగ్గుబాటి ప్రధానపాత్రలో నటిస్తున్నారు. భీమ్లా పాత్రలో పవన్.. డానియల్ శేఖర్‌గా రానా నటిస్తున్నారు. ఇటీవలే పవన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయగా..అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని తొలి సాంగ్ సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది.

ఇక ఇప్పుడు వరుస సినిమాలను లైన్‌లో పెట్టి అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు పవన్.

కాగా ఒకవైపు రాజకీయాల్లో రాణిస్తూనే, మరోవైపు వరస సినిమాలు చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే కదా మాకు కావాల్సింది బాస్ అని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.




