- Telugu News Photo Gallery Cinema photos Trisha Krishnan nayanthara upcoming movies update on 23 05 2025
జోష్ మీదున్న సీనియర్ నాయికలు.. షుగర్ బేబీ అంటూ త్రిష హల్ చల్
సిల్వర్ స్క్రీన్ మీద ఫ్రెష్ టాలెంట్‌కి ఉన్నంత క్రేజ్ సీనియర్లకు ఉండదనే మాట ఫేడవుట్ అవుతోంది. కోలీవుడ్‌లో ఆ ఇద్దరినీ చూసిన వారు మాత్రం.. వాళ్లు పేరుకే సీనియర్లు.. వాళ్లకున్న క్రేజ్‌తో పోలిస్తే జూనియర్లు అసలు దరిదాపుల్లో కూడా నిలవలేకపోతున్నారని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ వారెవరో మీకో ఐడియా వచ్చేసినట్టేగా...
Updated on: May 23, 2025 | 8:30 PM

సిల్వర్ స్క్రీన్ మీద ఫ్రెష్ టాలెంట్‌కి ఉన్నంత క్రేజ్ సీనియర్లకు ఉండదనే మాట ఫేడవుట్ అవుతోంది. కోలీవుడ్‌లో ఆ ఇద్దరినీ చూసిన వారు మాత్రం.. వాళ్లు పేరుకే సీనియర్లు.. వాళ్లకున్న క్రేజ్‌తో పోలిస్తే జూనియర్లు అసలు దరిదాపుల్లో కూడా నిలవలేకపోతున్నారని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ వారెవరో మీకో ఐడియా వచ్చేసినట్టేగా...

ఒకటా రెండా? బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు త్రిష. మొన్నటికి మొన్ననే ఒకటికి రెండు రిలీజులు చూశారు. అజిత్‌తో విడాముయర్చి క్లిక్ కాకపోయినా, గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం గట్టెక్కించేసింది.

ఇప్పుడు థగ్‌లైఫ్‌లో షుగర్ బేబీ అంటూ హస్కీగా మారిపోయారీ బ్యూటీ. ఉలగనాయగన్‌తో జోడీ కడుతూ, మణిరత్నంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు త్రిష.

సేమ్ టు సేమ్ నయన్ విషయంలోనూ ఇదే జోరు కనిపిస్తోంది. సంక్రాంతికి రఫ్ఫాడించేస్తాం అంటూ రీసెంట్‌గా అనిల్ రావిపూడితో కలిసి తెలుగులో మాట్లాడుతూ హల్‌చల్ చేశారు నయన్.

ఓ వైపు తమిళనాడులో లేడీ ఓరియంటెడ్ సినిమాలు, మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా కంటెంట్ డ్రైవ్ చేసే ప్రాజెక్టులు, ఛాన్స్ వస్తే స్టార్ హీరోల సినిమాలతో బిజీ బిజీగా కనిపిస్తున్నారు నయన్. రోల్స్ కి తగ్గట్టు తనను తాను మలచుకుంటూ దూసుకుపోతున్నారు.