సీనియర్ హీరో వెంకటేష్, శైలేష్ కొలను కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సైంధవ్. వెంకీ 75వ సినిమా ఇది. తాజాగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా సినిమాలోని 8 ప్రధానమైన పాత్రలను రివీల్ చేస్తూ.. ఓ వీడియోను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇందులో వెంకీతో పాటు నవాజుద్దీన్ సిద్ధికీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 22న విడుదల కానుంది సైంధవ్.