పెరుగుతున్న సంక్రాంతి పోటీ.. చివరి వరకు బరిలో ఉండే సినిమాలెన్ని?
సిల్వర్ స్క్రీన్‌కు సంక్రాంతికి మించిన పెద్ద పండుగ మరోటి ఉండదు. అందుకే ఆ డేట్స్ కోసం చాలా ముందు నుంచే కాంపిటీషన్ నడుస్తుంటుంది. తాజాగా 2026 సంక్రాంతికి బరిలో ఉండే సినిమాల గురించిన అప్‌డేట్స్ ఫ్యాన్స్‌కు కిక్కిస్తున్నాయి. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా పొంగల్ డేట్స్ మీద దృష్టి పెట్టారు.
Updated on: May 27, 2025 | 6:58 PM

2026 సంక్రాంతి బరిలో ఆల్రెడీ డేట్ లాక్ చేసిన సినిమా మెగా 157. చిరు - అనిల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఎట్టి పరిస్థితుల్లో పొంగల్ బరిలో దించాలని ఫిక్స్ అయ్యారు.

ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి సంక్రాంతి టార్గెట్‌గా పనులు పూర్తి చేస్తున్నారు. అయితే అదే డేట్‌కు మరో సీనియర్ హీరో బాలయ్య కూడా బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది.బాలయ్య కూడా 2026 సంక్రాంతిని ఎయిమ్ చేస్తున్నారన్నది లేటెస్ట్ అప్‌డేట్.

అఖండ 2 సినిమాను దసరా బరిలోనే రిలీజ్ చేయాలని భావించిన టీమ్, షూటింగ్ ఆలస్యమవుతుండటంతో ప్లాన్ మార్చింది. సంక్రాంతి కానుకగా ఆ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తోంది. బాలయ్య పొంగల్ రికార్డ్ కూడా రిలీజ్ డేట్ మార్పు విషయంలో ఓ కారణం అన్న టాక్ వినిపిస్తోంది.

మరోవైపు డార్లింగ్ ప్రభాస్ కూడా పొంగల్ డేట్స్ మీద దృష్టి పెట్టారు.చాలా రోజులుగా వాయిదా పడుతున్న ది రాజాసాబ్‌ను సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఇంకా డేట్ లాక్ చేయకపోయినా.. దాదాపు అదే సీజన్‌లో సినిమా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

తాజాగా ఈ రేసులోకి ఓ యంగ్ హీరో కూడా ఎంట్రీ ఇచ్చారు. అనగనగా ఒక రాజు సినిమాతో సంక్రాంతి బరిలో దిగుతున్నారు నవీన్ పొలిశెట్టి. ఇలా టాలీవుడ్‌లో ఆరు నెలల ముందు నుంచే సంక్రాంతి డేట్స్ కోసం పోటి కనిపిస్తోంది.




