- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroins like rashmika mandanna pooja hegde sreeleela interested doing movies than web series
సిల్వర్ స్క్రీన్ ముద్దు.. వెబ్ సీరీస్‌లు వద్దు అంటున్న ముద్దుగుమ్మలు
ఎప్పుడూ ఏదో ఒక సీరీస్‌తో బిజీ బిజీగా ఉన్న వారి గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు ఇప్పటిదాకా సీరీస్‌లు చేయని హీరోయిన్లు కూడా ఉన్నారనే విషయాన్ని పట్టించుకోం. చేతిలో సినిమాలున్నా లేకపోయినా, తీరిగ్గా కనిపించినా, కనిపించకపోయినా.. ఇప్పటిదాకా వెబ్ సీరీస్‌ల జోలికి వెళ్లలేదు కొందరు క్రేజీ భామలు. ఇంతకీ ఎవరు వారు?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jun 10, 2025 | 9:50 PM

నయనతార నటించిన సినిమాలు డైరక్ట్ ఓటీటీ రిలీజ్‌లు అయ్యాయేగానీ, ఇప్పటిదాకా వెబ్ సీరీస్‌ల వైపు కన్నెత్తి చూడలేదు ఈ లేడీ. చేయాల్సిన సినిమాలే చాలా ఉన్నాయి.. ఇప్పట్లో సీరీస్‌లకి టైమ్ లేదనుకుంటున్నారా? లేకుంటే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? నయన్ రూట్లోనే నేనూ అంటున్నారు పూజా హెగ్డే.

కెరీర్ ఒడుదొడుకుల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇతరత్రా ఆప్షన్ల కోసం చూడటం సహజం. కానీ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని ఫిక్సయ్యారేమో, పూజా హెగ్డే ఇప్పటిదాకా ఓటీటీ డెబ్యూ చేయలేదు. టైమ్ ఉంటే ట్రిప్పులు వేస్తున్నారేగానీ, ఓటీటీల మీద మాత్రం కాన్‌సెన్‌ట్రేట్ చేయడం లేదు. పూజ కాంటెంపరరీ రష్మిక కూడా ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు.

నార్త్ అండ్ సౌత్ నుంచి వచ్చిన సబ్జెక్టులను వినడానికే సరిపోతోంది రష్మిక మందన్నకు. ఆయా కథలకు తగ్గట్టు లుక్స్ మార్చుకోవడం, ప్రమోషన్లకు హాజరు కావడం, సెట్లో ఆన్ టైమ్‌లో ఉండటం.. ఇవన్నీ రష్మిక ముందున్న ప్రయారిటీస్. వీటన్నిటినీ దాటుకుని ఓటీటీల వైపు కాన్‌సెన్‌ట్రేట్ చేసే తీరిక లేనట్టుంది నేషనల్ క్రష్‌కి.

యంగ్ తరంగ్ శ్రీలీల మనసులోనూ ఇదే ఉందా? ఆ మధ్య చదువు కోసం అమ్మడు కాసింత గ్యాప్ తీసుకుంటేనే, ఒప్పుకోలేకపోయారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. అలాంటిది సీరీస్‌లూ, షోలూ అంటూ సినిమాలకు గ్యాప్ ఇస్తే ఊరుకుంటారా? అసలు ఆగరని తెలుసుకున్నారు కాబట్టే, వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్టులకు సైన్ చేస్తున్నారు శ్రీలీల.

సిల్వర్‌స్క్రీన్ దేవసేన అనుష్క కూడా ఇప్పటిదాకా వెబ్ సీరీస్‌ల వైపు చూడలేదు. ఆచితూచి, పర్ఫెక్ట్ ప్రాజెక్టులకు సైన్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ జర్నీనే కంటిన్యూ చేస్తున్నారు స్వీటీ శెట్టి. త్వరలోనే ఈ లేడీ ఘాటీతో లక్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు.



















