- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroines like meenakshi chaudhary, sai pallavi, rashmika mandanna continuing hits in 2025
ఈ సంవత్సరం కూడా ఏ మాత్రం తగ్గని జోరు.. హిట్స్ ను కంటిన్యూ చేస్తున్న హీరోయిన్లు
లాస్ట్ ఇయర్ ఏంటి? ఈ ఏడాది ఎంత వరకు వచ్చింది? సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఈ కంపేరిజన్ ఉంటూనే ఉంటుంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా సరే, హీరోయిన్ల వరకు వచ్చేసరికి కాస్త స్పీడప్ అవుతుంది. కొన్నిసార్లు పక్కవారితో కనిపించే పోటీ.. మరికొన్ని సార్లు వాళ్లల్లో వాళ్లకే కనిపిస్తుంటుంది.. ఈ ఏడాది అలా రేస్‌లో సక్సెస్ అయిన బ్యూటీస్ ఎవరు? చూసేద్దాం పదండి..
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 11, 2025 | 7:07 PM

పుష్ప ది రూల్ సినిమాలో మిగిలిన టీమ్ అందరికీ ఎంత పేరు వచ్చిందో, హీరోయిన్‌గా రష్మికకు అంతకు పదింతలు పేరు వచ్చేసింది. ఆ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేసి అందరినీ ఫిదా చేశారు మన నేషనల్ క్రష్.

లాస్ట్ ఇయర్ పుష్ప2 సక్సెస్‌ని ఈ ఏడాది ఛావా కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడే ఏమయింది.. ముందు ముందు చూద్దురుగానీ అంటూ రాబోయే సినిమాల గురించి ఊరిస్తున్నారు రష్మిక మందన్న. సక్సెస్ విషయంలో రష్మిక రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు మీనాక్షి చౌదరి. లాస్ట్ ఇయర్ ఆమె నటించిన సినిమా ఏదో ఒక సందర్భంలో మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది.. హిట్ టాక్ చెవిన పడుతూనే ఉంది..

ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సక్సెస్ స్ట్రీక్‌ని జాగ్రత్త చేసుకున్నారు ఈ లేడీ. మీనూ అంటూ ఇప్పటికీ ఆమె రోల్‌ని గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్. తెలుగులోనే కాదు, అదర్ లాంగ్వేజెస్‌లోనూ తన మార్క్ చూపించడానికి ట్రై చేస్తున్నారు మీనాక్షి చౌదరి.

ఆ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవి ఇప్పుడు ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. అమరన్ మూవీ మీద ప్రీ రిలీజ్ టైమ్‌లో పెద్దగా బజ్ లేదు. కానీ, సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం క్రెడిట్ అంతా మూటగట్టుకుని పట్టుకెళ్లిపోయారు సాయిపల్లవి.

లాస్ట్ ఇయర్ అమరన్‌తో ఫిదా చేసిన బుజ్జి తల్లి ఈ ఏడాది తండేల్‌తో మెప్పించేశారు. పల్లవి ఈజ్ బ్యాక్ అనిపించారు. ఉన్నపళాన ఆమె రెమ్యునరేషన్ చుక్కల్ని తాకుతోందనే మాటలు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. సక్సెస్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే ఆలోచన పల్లవికి కూడా వచ్చేసిందండోయ్ అంటున్నారు క్రిటిక్స్. అంతే మరి.. సక్సెసా.. మజాకా?





























