అర్ధరాత్రి హాలీవుడ్ కలలు.. శ్రీలీల ఫొటోస్ చూశారా..
పెళ్లిసందD సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ అమ్మడు తాజాగా మిడ్ నైట్ ఎక్కడో హాలీవుడ్ సినిమా కలలకు అంటూ కొన్ని ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ మీరు కూడా ఆ ఫొటోస్ పై లుక్ వేయండి.
Updated on: Mar 11, 2025 | 6:39 PM

హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన గ్లామర్‌తో టాలీవుడ్ అభిమానుల మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి సందడి సినిమాలో తన గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఈ మూవీ తర్వాత వరసగా ఆఫర్స్ అందుకుంది.

ఎవ్వరూ ఊహించని విధంగా వరసగా తొమ్మిది సినిమాలకు సైన్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ఆ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో తెలుగులో ఈ బ్యూటీ క్రేజ్ కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది

దీంతో ఈ ముద్దుగుమ్మ తెలుగులో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూనే, బాలీవుడ్ వైపు కన్నేసింది. బాలీవుడ్‌లో ఆషికీ3 సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఇక ఈ బ్యూటీ గ్లామర్‌నే కాదు డ్యాన్స్ అంటే కూడా చాలా మందికి ఇష్టం.

ఇటీవల పుష్ప2లో కిసక్కీ అంటూ కుర్రకారుకు చెమటలు పట్టించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సాంగ్ తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్‌తో అభిమానుల మనసు దోచుకుంటుంది.

తాజాగా శ్రీలీల హాలీవుడ్ నటి గెటప్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇందులో ఈ అమ్మడు అచ్చం హాలీవుడ్ యాక్టర్ లానే కనిపిస్తుంది. ఈ పిక్స్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. మిడ్ నైట్ ఎక్కడో హాలీవుడ్ సినిమాల కలలకు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.





























