- Telugu News Photo Gallery Cinema photos These heroines have limited movie opportunities even they have huge craze social media.
Tollywood Heroines: సోషల్ మీడియాలో క్రేజ్ పీక్స్.. అవకాశాలు అంతంత మాత్రమే.. ఎవరా హీరోయిన్స్.?
స్టార్ హీరోయిన్స్ విషయంలో ప్లస్ అవుతున్న గ్లామర్ షో.. యంగ్ బ్యూటీస్‌కు మాత్రం వర్కవుట్ కావటం లేదు. కెరీర్ గేరు మారాలంటే... గ్లామర్ ఇమేజ్ కూడా కావాలని ఫిక్స్ అయిన బ్యూటీస్, ఆల్రెడీ ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. కానీ పెద్దగా రిజల్ట్ అయితే కనిపిస్తున్నట్టుగా లేదు. ఎవరా హీరోయిన్స్.? ఈరోజు మనం చూద్దాం..
Updated on: May 23, 2025 | 6:00 PM

బాలీవుడ్ నుంచి సౌత్ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఇప్పటి వరకు అరడజనుకు పైగానే సినిమాలు చేశారు. కానీ వీటిలో ఒక్క ఇస్మార్ట్ శంకర్ తప్ప, హిట్ సినిమా మరోటి లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి గ్లామర్ క్వీన్ అన్న ట్యాగ్‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా మంచి ఫామ్‌లో కనిపిస్తారు. పబ్లిక్ అపియరెన్సుల్లోనూ బోల్డ్ నెస్ ఓవర్ లోడెడ్ అన్నట్టుగా ఉంటుంది నిధి ప్రజెన్స్. ఆన్‌లైన్‌లో ఈ రేంజ్‌లో ఫామ్ చూపిస్తున్నా.. ఆన్ స్క్రీన్ మీద జోరు చూపించలేకపోతున్నారు నిధి.

నిధి అగర్వాల్‌తో పాటే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీస్ ప్రియాంక జవాల్కర్, నభా నటేష్. లుక్స్ పరంగా కాస్త సిమిలర్‌గా కనిపించే ఈ భామలు.. గ్లామర్ షో విషయంలో మాత్రం ముంబై హీరోయిన్లకు పోటి ఇస్తున్నారు.

కెరీర్ స్టార్టింగ్‌లోనే విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాలా లాంటి హిట్ సినిమా పడినా కూడా... ప్రియాంక కెరీర్ మాత్రం హిట్ ట్రాక్‌లో పడలేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ యాసతో అదరగొట్టిన నభాకి కూడా అవకాశాలు తలుపుతట్టలేదు.

సోషల్ మీడియా పోస్ట్‌ల్లో నో లిమిట్స్ ఫర్ గ్లామర్ అన్నట్టుగా ఉంటారు యంగ్ బ్యూటీ రుహానీ, కేతిక. చేసిన సినిమాల నంబర్ తక్కువే అయినా... తమకు సపరేట్ క్రేజ్ సొంతం చేసుకున్నారు ఈ బ్యూటీస్. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్‌తో హల్ చల్ చేసిన ఈ ముద్దుగుమ్మలు.. సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఆ రేంజ్‌లో అవకాశాలు అందుకోలేకపోతున్నారు.

తాజాగా లిస్ట్‌లోకి బాలీవుడ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. జస్ట్ అలా కన్నుగీటి పాపులర్ అయిన ప్రియా.. నితిన్ చెక్ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఫెయిల్ అవ్వటంతో ఆదిలోనే కెరీర్‌కు బ్రేక్ పడింది. దీంతో అవకాశాల కోసం రెగ్యులర్‌గా హైదరాబాద్‌లో కనిపిస్తున్న ప్రియా... సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు.




