- Telugu News Photo Gallery Cinema photos These heroines are not getting chance even they are doing glamour show
అందాల భామలకు కలిసిరాని గ్లామర్ ఇమేజ్
అవకాశాల కోసం గ్లామర్ షో మీదే దృష్టి పెట్టిన అందాల భామలకు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా కలిసి రావటం లేదు. రీసెంట్ టైమ్స్‌లో అలా గ్లామర్ షోను నమ్ముకున్న బ్యూటీస్ సక్సెస్ అయిన దాఖలాలు పెద్దగా కనిపించటం లేదు. సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు కావ్య థాపర్. ఇప్పటికే అరడజను సినిమాలు చేసిన ఈ బ్యూటీకి ఇంత వరకు మంచి నటి అన్న పేరైతే రాలేదు.
Updated on: Oct 21, 2024 | 9:45 PM

అవకాశాల కోసం గ్లామర్ షో మీదే దృష్టి పెట్టిన అందాల భామలకు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా కలిసి రావటం లేదు. రీసెంట్ టైమ్స్‌లో అలా గ్లామర్ షోను నమ్ముకున్న బ్యూటీస్ సక్సెస్ అయిన దాఖలాలు పెద్దగా కనిపించటం లేదు.

సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు కావ్య థాపర్. ఇప్పటికే అరడజను సినిమాలు చేసిన ఈ బ్యూటీకి ఇంత వరకు మంచి నటి అన్న పేరైతే రాలేదు.

అయినా బ్రేక్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే అవకాశాల విషయంలో కావ్యకు కలిసొస్తున్న గ్లామర్ షో... సక్సెస్‌కి మాత్రం హెల్ప్ అవ్వటం లేదు. రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నభా నటేష్ కూడా అందాల ప్రదర్శననే నమ్ముకున్నారు.

తెర మీద అల్ట్రా గ్లామరస్‌గా కనిపించే ఛాన్స్ ఇంకా రాకపోయినా... ప్రైవేట్ ఈవెంట్స్‌లో మాత్రం హాట్ లుక్స్‌తో అదరగొడుతున్నారు. ఆ ఇమేజ్‌తోనే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు నభా నటేష్.

ఇన్నాళ్లు అచ్చమైన తెలుగమ్మాయిగా కనిపించిన అనుపమా పరమేశ్వరన్ కూడా ఈ మధ్య రూట్ మార్చారు. టిల్లు స్క్వేర్ మూవీలో హాట్ లుక్స్‌తో అదరగొట్టడమే కాదు, బ్లాక్ బస్టర్ హిట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నారు. కానీ ఈ సక్సెస్ అవకాశాల విషయంలో అనుపమకు అస్సలు హెల్ప్ అవ్వలేదు.




