- Telugu News Photo Gallery Cinema photos These celebraites gives majar friendship goals with their camaraderie
Best Friends in Film Industry: సౌత్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న హీరోహీరోయిన్లు వీళ్లే..
సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉంటారు. కెరీర్ ప్రారంభంలో మొదలైన స్నేహం.. ఎలాంటి అపార్థాలు లేకుండా.. సుదీర్ఘకాలం కొనసాగే వారు సౌత్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. వారిలో కొంత మంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Mar 18, 2021 | 12:38 PM

నాగార్జున అక్కినేని, మెగాస్టార్ చిరంజీవి.. అలనాటి అగ్రహీరోలైన నాగార్జున, చిరంజీవి మంచి స్నేహితులు. వీరిద్దరి స్నేహం ఇప్పటికీ ఎలాంటి మనస్పర్థలు లేకుండా కొనసాగుతూనే ఉంది.

ప్రభాస్, అనుష్క శెట్టి.. సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్కల జంట చుడముచ్చటగా ఉంటుంది. వీరిద్దరు లవ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్ళిచేసుకోబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఓ టీవీ షోలో అనుష్క ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చింది.

మహేష్ బాబు, తలపతి విజయ్.. మహేష్.. తన స్కూల్, కాలేజీ చదువును చెన్నైలో పూర్తిచేశాడు. ఆ సమయంలో సూర్య, కార్తీ, తలపతి విజయ్ క్లాస్మేట్స్. కాలేజీ రోజులలో నుంచే తలపతి విజయ్, మహేష్ బాబు విజయ్ అత్యంత ప్రాణస్నేహితులుగా మారారు.

అల్లు అర్జున్, ప్రభాస్.. వీరిద్దరు మంచి స్నేహితులు.. వీరిని తమ అభిమానులు జై-వీరు అని పిలుస్తుంటారు.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. వీరిద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫ్రెండ్స్. గతంలో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో అభిమానులు గొడవను క్రియేట్ చేయగా.. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని.. ఫ్యాన్స్ వారి మధ్య మనస్పర్థలు తీసుకురావద్దని గతంలో వీరిద్దరు సోషల్ మీడియాలో కోరారు.




