- Telugu News Photo Gallery Cinema photos Naveen polishetty and faria abdullah jathirathnalu team visits thirumala
Jathi Rathnalu Movie Team In Thirumala: తిరుమలలో సందడి చేసిన ‘జాతిరత్నాలు’ టీం..
గురువారం ఉదయం 'జాతిరత్నాలు' టీం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మహశివరాత్రి కానుకగా విడుదలైన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా 'జాతిరత్నాలు' టీం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Updated on: Mar 18, 2021 | 1:50 PM

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం అందించాడు.

మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్.. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఈ నిర్మించాడు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయింది.

తిరుమల వచ్చిన నవీన్ పోలిశెట్టి ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి వచ్చేటప్పుడు చక్కెర పొంగలి దొరుకుంతుందా లేదా అనే సందేహంతో తిరుమలకు వచ్చాననీ, కానీ స్వామివారు చక్కెర పొంగలి దక్కేలా చేసి తమని ఆశీర్వదించాడని అన్నాడు.

జాతి రత్నాలు సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. థియేటర్లలో జాతి రత్నాలు నవ్వుల పువ్వులు పూయిస్తున్నారన్నారు. స్వామివారి ఆశీస్సులతో విజయోత్సవ యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలలో నటించారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొతం చేసుకుంది.




