Tollywood: ప్లానింగ్ లేని దర్శకులు.. నిర్మాతలకు తప్పని నష్టాలు..!
దర్శకుల ప్లానింగ్ లేని ఆలోచనలతో నిర్మాతలు నిలువునా మునిగిపోతున్నారా..? ఏం తీస్తున్నారో కూడా కనీసం క్లారిటీ లేకుండా.. ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టిస్తూ ప్రొడ్యూసర్స్‌ను అడ్రస్ లేకుండా చేస్తున్నారా..? ఈ మధ్య కాలంలో కనీసం ఓపెనింగ్స్ రాని భారీ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటి బాధ్యత తీసుకునేదెవరు..? నిర్మాతల నష్టాలకు సమాధానమిచ్చేదెవరు..? ఫ్లాపులు ఎవరైనా తీస్తారు.. అదేం పెద్ద క్రైమ్ కాదు. ప్రతీ దర్శకుడి నుంచి అలాంటి సినిమాలు వస్తుంటాయి.