- Telugu News Photo Gallery Cinema photos Telugu Actresses and Social Media Balancing Fame and Privacy
సోషల్ మీడియాను హ్యాండిల్ చేయలేకపోతున్న హీరోయిన్స్..
సోషల్ మీడియాను బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు.. దాని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. అన్నింటికీ సిద్ధమయ్యాకే అందులోకి దిగాలి. మధ్యలో మారిపోతాం అంటే కుదరదు. ఈ విషయంలో మన హీరోయిన్ల శైలి ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంది. కొందరు తప్పుకుంటున్నారు.. మరికొందరు తట్టుకుంటున్నారు.
Updated on: Sep 16, 2025 | 7:26 PM

తన ఇమేజ్‌కు భంగం కలిగించేలా ఫోటోలను వాడుకుంటున్నారంటూ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యా రాయ్‌కు అక్కడ్నుంచి అనుకూలమైన తీర్పు వచ్చింది.

ఐశ్వర్య ఫోటోలను అనుమతి లేకుండా వాడకూడదని.. అలా చేస్తే ఆమె ప్రైవసీకి భంగం వాటిల్లినట్లే అని తీర్పిచ్చింది హై కోర్టు. కొన్నాళ్లుగా తప్పుడు ఫోటోలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు ఐష్.

సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్ల ప్రైవసీ బాగా దెబ్బ తింటుంది. ముఖ్యంగా అందులో వచ్చే నెగిటివిటీ కూడా వాళ్లపై ప్రభావం చూపిస్తుంది. అయితే దీనిపై ఒక్కొక్కొరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

తాను అస్సలు ఇలాంటివి పట్టించుకోవడమే మానేసానని.. దేన్నైనా తీసుకునే దమ్ముండాలి అంటున్నారు సమంత. విడాకుల సమయంలో ఈమెపై మామూలు ట్రోలింగ్ జరగలేదు.విడాకుల సమయంలోనే మరింత స్ట్రాంగ్ అయ్యానన్నారు సమంత. తన గురించి ఇప్పుడెవరేం అన్నా పట్టించుకోనంటున్నారు స్యామ్.

మరోవైపు శృతి హాసన్ ఆ మధ్య ఈ నెగిటివిటి తట్టుకోలేక కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చారు. ఇదే రూట్‌లో అనుష్క శెట్టి సైతం వెళ్తున్నారు. తాజాగా ఐశ్వర్య లక్ష్మి సైతం సోషల్ మీడియా నుంచి తప్పుకున్నారు.




