- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan OG movie actress Priyanka Mohan to join the Telugu Indian Idol S4 stage on AHA OTT
Telugu Indian Idol S4: తెలుగు ఇండియన్ ఐడల్లో ఓజీ వైబ్.. OG చీర కట్టుకొని వచ్చిన ప్రియాంక మోహన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే హరి హర వీరమల్లు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఈ సినిమా తర్వాత పవన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఓజీ. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.
Updated on: Sep 16, 2025 | 4:32 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఓజీ. ఇందులో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.

ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సువ్వి సువ్వి సాంగ్.. ఇప్పటికే ప్రియాంక ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయింది. తాజాగా ఆహా సింగింగ్ షోలో సందడి చేసింది ప్రియాంక.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రతి శుక్ర, శనివారాలు ఈ షోకు సంబంధించిన కొత్త ఎపిసోడ్స్ టెకికాస్ట్ చేస్తున్నారు. శుక్ర, శనివారాల్లో సాయంత్రం 7 గంటలు స్ట్రీమింగ్ అవుతుంది.

తాజాగా ఈషోలో హీరోయిన్ ప్రియాంక మోహన్ సందడి చేసింది. ఓజీ చీరకట్టులో తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై మెస్మరైజ్ చేసింది. అలాగే ఈ షోలో ఓజీ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఇందుకు సంబంధించిన ఓజీ స్పెషల్ ఎపిసోడ్స్ ఈనెల 19, 20న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేసింది ఆహా.ఈ షోలో తమన్, సింగర్ కార్తీక్, గీతామాధురిలు జడ్జీలుగా ఉండగా శ్రీరామచంద్ర, సమీరా భరద్వాజ్ లు హోస్ట్ చేస్తున్నారు.




