Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hit 3: హిట్ 3 ఫ్యాన్స్ కోసం పెద్ద సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్న నాని.. గూస్ బంప్స్ రావాల్సిందే

నాని ఉన్నాడు కాబట్టి హిట్ 3పై అంచనాలు ఉండటం కామన్.. కానీ ఇతర భాషల్లో ఈ ఫ్రాంచైజీపై ఎందుకు ఆసక్తి ఉంటుంది చెప్పండి..? అందుకే తన సినిమాపై వేరే ఇండస్ట్రీలు కూడా ఫోకస్ చేయాలని మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు న్యాచురల్ స్టార్. హిట్ 3లోనే అది అప్లై చేస్తున్నారు. ఇంతకీ నాని చేయబోయే ఆ ప్లాన్ ఏంటి..?

Phani CH

|

Updated on: Apr 05, 2025 | 1:05 PM

తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు తక్కువే.. తాజాగా నాని అలాంటి ఓ వరల్డ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అదే హిట్ ఫ్రాంచైజీ. ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఫస్ట్ కేస్ విశ్వక్ సేన్, సెకండ్ కేస్ అడివి శేష్‌కు బాగానే వర్కవుట్ అయ్యాయి.

1 / 5
తాజాగా 3వ కేసుతో వచ్చేస్తున్నారు నాని. మే 1న హిట్ 3 విడుదల కానుంది. హిట్ 3ని ప్యాన్ ఇండియన్ సినిమాగా తీసుకొస్తున్నారు నాని. అందుకే ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచేసారు. పైగా ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే.

2 / 5
దాదాపు 80 కోట్లకు పైగా బడ్జెట్‌తో హిట్ 3ని నిర్మిస్తున్నారు నాని. అందుకే మిగిలిన భాషల మార్కెట్‌ను కూడా క్యాష్ చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే హిట్ 3లో ఇతర భాష హీరోలను భాగం చేస్తున్నారు నాని.

3 / 5
హిట్ 3 ఫ్రాంచైజీకి అన్ని భాషల హీరోలను ఒకేచోటికి తీసుకొచ్చే స్కోప్ ఉందని.. ఇదో యూనివర్స్ అంటున్నారు నాని. అన్నట్లుగానే హిట్ 2 క్లైమాక్స్‌లో అర్జున్ సర్కార్‌గా ఎంట్రీ ఇచ్చారు నాని. అలాగే తాజాగా హిట్ 3 క్లైమాక్స్ కోసం మరో భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు న్యాచురల్ స్టార్. ఈసారి తెలుగు నుంచి కాదు తమిళ నుంచి హిట్ ఫ్రాంచైజీలోకి హీరోను తీసుకొస్తున్నారు.

4 / 5
హిట్ 3 క్లైమాక్స్‌లోనే హిట్ 4 ఫోర్త్ కేసుకు సంబంధించిన లీక్ ఇవ్వబోతున్నారు. ఈ ఫ్రాంచైజీలోని నాలుగో భాగంలో కార్తి హీరోగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కార్తికి పోలీస్ క్యారెక్టర్స్ బాగా కలిసొచ్చాయి. అందుకే కార్తితోనే హిట్ 4 ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి హిట్ ఫ్రాంచైజీని అన్ని ఇండస్ట్రీలకు విస్తరిస్తున్నారు నాని.

5 / 5
Follow us