బంగారపు బొమ్మలా అనసూయ.. ఎంత ముద్దుగుందో..
అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తాజాగా చీరలో తన అందాలతో మాయ చేసింది. చూడనీకి అచ్చం బంగారు బొమ్మలా దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓలుక్ వేయండి.
Updated on: Apr 05, 2025 | 2:45 PM

బ్యూటీ అనసూయ గురించి ఎంత చెప్పానా తక్కువే. వన్నే తగ్గని అందం, ఈ ముద్దుగుమ్మ సొంతం. జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించిన ఈ చిన్నది తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ పాత్రలో ఈ అమ్మడు ఒదిగిపోయి, అద్భుతంగా నటించి మెప్పించింది. దీంతో రంగస్థలం సినిమా తర్వాత అనసూయకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.

దీంతో చాలా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ఈ మధ్య పుష్ప సినిమాలో కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడూ తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ.. తన గ్లామర్ తో కుర్రకారును మాయచేస్తుంటుంది. తన అంద చందాలతో అందరినీ తన వైపుకు లాక్కుంటుంది.

తాజాగా అనసూయ బంగారు వర్ణం చీరలో అందంగా రెడీ అయ్యి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇందులో ఈ అమ్మడు చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపించడంతో, తన ఫ్యాన్స్ అచ్చం బాపుబొమ్మలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.



